తెలంగాణ

నాలుగు కోట్ల ప్రజాపాలన ఆ నలుగురి గుప్పిట్లోనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల, సెప్టెంబర్ 25: తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల మంది ప్రజల పరిపాలన ఆ నలుగురి గుప్పిట్లోనే బందీ అయిందని సీఎం కుటుంబం రాచరిక కుటుంబంలానే వ్యవహరిస్తోందని టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎలగందుల రమణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని జగిత్యాలలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఎల్. రమణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని 60 నెలలు పరిపాలించాలని ప్రజలు అధికారం అప్పగిస్తే అసెంబ్లీని అకస్మాత్తుగా రద్దు చేసి ఆపద్ధర్మ సీఎంగా కొనసాగుతూ అదే రోజు 105 మంది అభ్యర్థుల జాబితా ప్రకటించారని ఇందులో సగం ధనిక, ఉన్నత వర్గాలకే సీట్లు కేటాయించారన్నారు. ఇచ్చిన హామీలు పూర్తిగా ఏ ఒక్కటీ నెరవేరకపోవడంతోనే వాటిని కప్పిపుచ్చుకోవడానికే అసమర్థ సీఎం ముందస్తు ఎన్నికలు తెచ్చారని, దీంతో వందల కోట్ల నష్టం వాటిల్లుతుందన్నారు. 63 స్థానాలు ఉన్న టీఆర్‌ఎస్ 93 స్థానాలకు ఎగబాకిందని ఫిరాయింపులు ప్రోత్సహించడం, సీఎం విపక్షాలను శత్రువుగా భావించారన్నారు. మహాకూటమి ఆషామాషీ కాదు ప్రజల ఆలోచన, సబ్బండ వర్గాల ఆశయం మేరకే ఏర్పడిందన్నారు. ఎన్నికల షెడ్యూల్‌ను చెప్పిన సీఎం కేసీఆర్‌కు ఎన్నికల కమీషన్ చీవాట్లు పెట్టిందని, 51నెలల పాలనలో రూ. 5లక్షల 75వేల కోట్లు ఖర్చు చేశారని, వీటి లెక్క చెప్పాలని ఎల్. రమణ డిమాండ్ చేశారు. భారతదేశంలోనే సెక్రటేరియట్‌కు రాకుండా పాలన సాగించే సీఎం కేసీఆరేనన్నారు. ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టోతో మహాకూటమి ఎన్నికలకు వెళ్తుందని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని మహాకూటమి జెండా జగిత్యాలలో ఎగురవేయడం ఖాయమని రమణ స్పష్టం చేశారు. కొండగట్టు మృతుల బంధువులను పరామర్శిం చేందుకు రాకపోవడం కేసీఆర్ అహంకార పూరితమేనని, మాటల్లో ప్రేమవాత్సల్యం నటిస్తారని, మనసులో కనికరం ఉండదన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షురాలు జ్యోతిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు అయిల్నేని సాగర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ