తెలంగాణ

రైతన్నల విత్తన పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌటుప్పల్, మే 31: సబ్సిడీ విత్తనాల కోసం అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు. నల్లగొండ జిల్లా చౌటుప్పల్ సింగిల్‌విండో కార్యాలయం, వ్యవసాయ శాఖ కార్యాలయం ఎదుట సబ్సిడీ విత్తనాల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. సబ్సిడీ విత్తనాలు వచ్చిన గంటలోనే ఖాళీ అవుతున్నాయి. ప్రభుత్వం పత్తి పంటలకు ప్రత్యామ్నాయంగా పప్పు ధాన్యాలను సాగు చేసుకోవాలని వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం కల్పించడంతో రైతుల దృష్టి పప్పు్ధన్యాల పంటల సాగుపై పడింది. అందుకు అవసరమైన విత్తనాలను ప్రభుత్వం సరఫరా చేస్తుందని చెప్పడంతో సబ్సిడీ విత్తనాల కోసం ఎదురు చూస్తున్నారు. పాసుపుస్తకాల జిరాక్స్ కాపీలను పట్టుకుని ప్రభుత్వ కార్యాలయాల చుట్ట్టూ తిరుగుతున్నారు. మంగళవారం సింగిల్‌విండో కార్యాలయానికి నాలుగు కిలోల బ్యాగులు 250 (టన్ను) పెసర విత్తనాలు దిగుమతయ్యాయి. ఒక్కో బాగు ధర రూ.462 ఉండగా సబ్సిడీ పోను రూ.250కి అందజేశారు. వచ్చిన గంటలోనే అయిపోయాయి. రైతులు పెద్ద ఎత్తున ఎగబడడంతో సిబ్బంది ఇబ్బంది పడ్డారు. కార్యాలయం ముందు సబ్సిడీ విత్తనాల కోసం బారులు తీరారు. వచ్చిన విత్తనాలు ఏమూలకు సరిపోలేదు. కొంతమంది రైతులు సబ్సిడీ విత్తనాలు లభించక వెనుదిరిగారు. వర్షాకాలం నెత్తిమీదికి రావడంతో విత్తనాలు సిద్ధంగా లేక రైతులు ఆందోళనకు గురవుతున్నారు. రైతులకు కావలసిన విత్తనాలను అందుబాటులో ఉంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

చిత్రం సబ్సిడీ పెసర విత్తనాల కోసం బారులు తీరిన రైతులు