తెలంగాణ

తప్పదు రాజకీయ పునరేకీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 1: తెలంగాణను అస్థిర పరచడానికీ కుట్ర జరుగుతోందని, ఎదుర్కోవడానికి రాజకీయ పునరేకీకరణ అవసరమని సిఎం కెసిఆర్ పిలుపునిచ్చారు. తెదేపాకు చెందిన మల్కాజ్‌గిరి ఎంపి మల్లారెడ్డి బుధవారం క్యాంపు కార్యాలయంలో సిఎం సమక్షంలో తెరాస పార్టీలో చేరారు. ఆయనకు పార్టీ కండువాను కప్పి, పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం సిఎం కెసిఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ అత్యవసరమన్నారు. రాజకీయ అవసరాల కోసం ఆషామాషీగా చేరికలు జరగటం లేదని, తెలంగాణ గెలిచి నిలిచేందుకు అనుసరిస్తున్న వ్యూహంలో భాగంగానే జరుగుతున్నాయన్నారు. రాష్ట్ర సాధనకు తాను ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు చాలామంది ఇది అయ్యేదా, పోయేదా అని నిరూత్సహాన్ని వ్యక్తం చేశారన్నారు. మరి కొందరేమో 1969 మాదిరిగానే ఉద్యమాన్ని నడిపించాలని కోరారన్నారు. అయితే దానికి తాను అంగీకరించలేదన్నారు. మీకు స్ట్రీట్ ఫైట్ కావాలా? స్టేట్ ఫైట్ కావాలా? అని కుండబద్ధలు కొట్టినట్టు స్పష్టం చేశానన్నారు. జై తెలంగాణ నినాదాలతో రాష్ట్రం రాదని చెప్పానని, వ్యూహాత్మకంగా, డిప్లమాటిక్‌గా ముందుకుపోవాలని చెప్పానని సిఎం గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమం ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకం కాదని ఆనాడే చెప్పానన్నారు. నేను నడిపే ఉద్యమంలో ఆంధ్ర గోబ్యాక్ నినాదాలు ఉండవని స్పష్టం చేశానన్నారు. మన నీళ్లు, మన నిధులు, మన ఉద్యోగాలు మనకు దక్కడం కోసం తెలంగాణ కావాలి కానీ ఎవరికో వ్యతిరేకం కాదని అప్పడే చెప్పానని సిఎం కెసిఆర్ గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమం రాజకీయ పార్టీగా ముందుకు పోతుండటంతో అప్పుడు సిఎంగా ఉన్న చంద్రబాబు, ఆంధ్ర శక్తులు ఉద్యమాన్ని నీరు కార్చేందుకు అనేక కుట్రలు, కుతంత్రాలు చేశారన్నారు. తెలంగాణ అభివృద్ధిని కాంక్షించే శక్తులన్నీ ఏకమై రాజకీయ, ఆర్థిక సుస్థిరత పంథా కొనసాగించాలని, అందుకోసం పునరేకీకరణ అవసరమని సిఎం పిలుపునిచ్చారు.

చిత్రం... ఎంపీ మల్లారెడ్డిని పార్టీలోకి ఆహ్వానిస్తున్న సిఎం కెసిఆర్