తెలంగాణ

అగ్రనేతల్లో స్వార్థం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 9: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దశాబ్దాలపాటు మావోయిస్టు కార్యకలాపాల్లో నిమగ్నమై మంగళవారం హైదారాబాద్ పోలీసుల ఎదుట లొంగిపోయిన నక్సల్స్ దంపతులు పురషోత్తం, వినోదిని అధినాయకత్వంపై తీవ్రమైన విమర్శలు చేశారు. పోలీసుల కంటిమీద కునుకులేకుండా చేసిన వీరిద్దరూ మావోయిస్టు పార్టీ నుంచి ఎందుకు బయటకు వచ్చిందీ వివరించారు. మావోయిస్టు పార్టీ కేడర్‌ను పటిష్టం చేసుకునే దిశగా కొత్త సభ్యులు చేర్చుకుంటున్న తరుణంలో కీలక నేతలు పోలీసులకు లొంగిపోవడం గమనార్హం. ఏవోబీలో ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణం పోలీసులు, మావోలు పైచేయి కోసం దాడులకు వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్న సందర్భంలో కీలక నేతలు లొంగపోవడం పట్ల సర్వత్రా చర్చనీయాంశం అయింది. కాగా మావోయిస్టు పార్టీ పటిష్టపర్చడానికి వందలాది మంది యువతీయువకులను ఎంపిక చేశామని, అయితే వారికి ఎత్తుగడలు, వ్యూహాలను నేర్పించడం, శిక్షణ ఇవ్వడంలో హైకమాండ్ ఘోరంగా విఫలమైందని వారు విమర్శించారు. ప్రశాతంగా జీవనం సాగించాలని భావించే లొంగిపోయామన్నారు. అలాగే మావోయిస్టు అగ్రనేతల్లో స్వార్థం పెరిగిపోయిందని తీవ్ర ఆరోపణ చేశారు. దీంతో కేడర్ అసంతృప్తికి గరి అవుతోందని చెప్పారు. ప్రజల్లో నానాటికి మావోయిస్టు పట్ల ఆదరణ తగ్గిపోతోందని అభిప్రాయపడ్డారు. హైకమాండ్ వైఫల్యం అడుగడుగునా ఉందని ధ్వజమెత్తారు.

చిత్రం..లొంగిపోయిన మావోయస్టు దంపతుల వివరాలను మీడియాకు వెల్లడిస్తున్న హైదరాబాద్ కమిషనర్ అంజనీకుమార్