తెలంగాణ

ఎన్‌కౌంటర్లలో ఇద్దరు మావోలు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, డిసెంబర్ 25: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో శుక్రవారం జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. ఛత్తీస్‌గఢ్, ఒడిషా రాష్ట్రాల సరిహద్దులోని చందామెట్ట అటవీ ప్రాంతంలో మావోయిస్టు శంకరన్న దళం సంచరిస్తుందన్న ఎస్‌ఐబీ, ఐబీ వర్గాల సమాచారంతో పోలీసులు ఈ అడవిని చుట్టుముట్టారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య హోరాహోరీగా కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల అనంతరం మావోయిస్టులు పారిపోగా సంఘటన స్థలంలో ఆయుధంతో సహా ఒక మావోయిస్టు మృతదేహం, విప్లవసాహిత్యం లభ్యమైంది. మరో ఘటనలో దర్బా పోలీసుస్టేషన్ పరిధిలోని కపనార్ గ్రామంలో పోలీసులకు, మావోయిస్టులకు ఎదురు కాల్పులు జరిగాయి. కటేకల్యాణ్- పకనార్ క్యాంప్ నుంచి డిఆర్‌జీ, సీఏఎఫ్ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా కపనార్ గ్రామ అటవీ ప్రాంతంలో మావోయిస్టు దళం తారసపడింది. దీంతో ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. సంఘటన స్థలం నుంచి బర్మార్ తుపాకీతో సహా మావోయిస్టు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. గత రెండు నెలల కాలంలో ఛత్తీస్‌గఢ్ పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్లలో 21 మంది మావోయిస్టులు చనిపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా దంతెవాడ జిల్లా పోలీసులు నలుగురు జన మిలీషియా సభ్యులను శుక్రవారం అరెస్టు చేశారు. వీరంతా మావోయిస్టుల సహాయంతో రైలు మార్గాలను ధ్వంసం చేయడం వంటి అనేక హింసాత్మక ఘటనలకు పాల్పడినట్లు బస్తర్ ఐజీ కల్లూరి వెల్లడించారు.