తెలంగాణ

వచ్చే నెల బాలోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 11: ప్రతి ఏటా అవార్డు టీచర్సు అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బాలోత్సవాన్ని ఈ ఏడాది నవంబర్ 10, 11 తేదీల్లో రవీంద్రభారతిలో జరుపుతున్నట్టు సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు బెక్కంటి శ్రీనివాసరావు తెలిపారు. బాలల దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయుల అసోసియేషన్, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, పీఆర్‌టీయూ, జీఎస్పీ వీరారెడ్డి ట్రస్టు, శ్రీయా ఇంజనీరింగ్ కాలేజీ , శ్రీరాం లైఫ్ తదితర సంస్థల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. భక్తరామదాసు కీర్తనలపై వెయ్యి మందితో రవీంద్రభారతి ప్రాంగణంలో బృందనృత్యం వేడుకలు నిర్వహిస్తామని అన్నారు. భారతీయ సంప్రదాయ పది నృత్యరూపాలను నిర్వహిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. వివిధ ప్రాంతాల నుండి సుమారు 3వేల మంది పాల్గొంటారని , వారందరికీ సౌకర్యాలను కల్పిస్తున్నట్టు చెప్పారు. ఈ ఉత్సవాల సందర్భంగా వివిధ రకాల పోటీలు నిర్వహిస్తున్నామని , అందుకు ముందుగా రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. ఆటా అవార్డ్సు 26 అంశాలు, 47 విభాగాలు, నాలుగు కేటగిరిల్లో ఇవ్వనున్నట్టు చెప్పారు.