తెలంగాణ

కేసీఆర్‌కు ఓటమి భయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 11: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గల్లీలో పులి...్ఢల్లీలో మాత్రం పిల్లి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ అన్నారు. గురువారం సాయం త్రం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. కరీంనగర్ సమరభేరి సభను అసమర్థసభగా కేటీఆర్ వర్ణించడంపై లక్ష్మణ్ మండిపడ్డారు. సమరభేరి సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారని అన్నారు. రెండుసార్లు అమిత్ షా తెలంగాణకు వస్తే తెరాస నేతలు బెంబేలెత్తిపోతున్నారని అన్నారు. అమిత్ షా రెండు మార్లూ అనేక అంశాలను లెవనెత్తారని, వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత టీఆర్‌ఎస్‌పై లేదా అని లక్ష్మణ్ అన్నారు. తొమ్మిది నెలలకు ముందు ఎన్నికలకు పోవడానికి కారణాలు చెప్పాలని అడిగారని, తొలుత జమిలి ఎన్నికలకు సరే అన్న కేసీఆర్ తర్వాత ఎందుకు మాట మార్చారని నిలదీశారని అన్నారు. కేంద్రం లక్షల కోట్ల సాయం చేస్తే ఆ నిధులు ఏం చేశారని అమిత్ షా అడిగారని వాటికి సమాధానం చెప్పడం లేదని అన్నారు. ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీనీ అమలుచేయకుండా మళ్లీ ఓట్లు అడుగుతున్నారని ధ్వజమెత్తారు. ఉద్యమ కారులను మోసం చేసిన టీఆర్‌ఎస్ నేతలు బీజేపీని ప్రశ్నిస్తారా అని అన్నారు. ఆలయాల పరిరక్షణపై మాట్లాడే నైతిక హక్కు టీఆర్‌ఎస్‌కు లేదని అన్నారు. నాలుగున్నరేళ్లుగా కేంద్రం ఇచ్చిన నిధులు తీసుకున్న కేసీఆర్ ఇపుడు ఏమీ ఇవ్వలేదని అనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. యుపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కొనసాగిన కేసీఆర్ ఆనాడు ఎన్ని కోట్ల నిధులు తీసుకువచ్చారో చెప్పాలని అన్నారు. హక్కుగా రావల్సిన నిధులతో పాటు తెలంగాణకు అదనంగా మోదీ ప్రభుత్వం నిధులు కేటాయించిందని చెప్పారు. మోదీని ఎదుర్కొనే సత్తాలేని కాంగ్రెస్‌తో అంతర్గత ఒప్పందం చేసుకుందని ఆరోపించారు. ఓట్ల కోసం హిందువులను, ముస్లింలను మోసం చేసింది మీరు కాదా అని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వస్తే పథకాలు, ప్రాజెక్టులపై విచారణ జరిపిస్తామని హెచ్చరించారు. పంచాయతీ ఎన్నికల విషయంలో ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు వేసిందని, ఓటమి భయంతోనే ఎన్నికలు నిర్వహించలేదని లక్ష్మణ్ అన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని లక్ష్మణ్ పేర్కొన్నారు.