తెలంగాణ

ఆ మూడు పార్టీలను ఓడించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 11: త్వరలో జరగబోవు అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలను చిత్తుగా ఓడించాలని సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ పిలుపునిచ్చింది. గురువారం ఇక్కడ సీఐటీయూ కౌన్సిల్ సమావేశాలు జరిగాయి. అధ్యక్షుడు చుక్కా రాములు, ప్రధాన కార్యదర్శి సాయిబాబా మాట్లాడుతూ టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలు హామీలను అమలు చేయకుండా తగుదునని మళ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయని విమర్శించారు. ఈ ఎన్నికల్లో మూడు పార్టీలను ఓడించడమే ప్రధాన అజెండాగా ఎన్నికల ప్రచారం చేస్తామని వెల్లడించారు. ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చకుండా కేసీఆర్ మళ్లీ ఎన్నికలకు వెళ్లడం జనాన్ని మోసం చేయడమేనని విమర్శించారు. ఉద్యోగాల్లో ఖాళీలు భర్తీ చేయకుండా నిరుద్యోగులను మోసం చేశారని వారు ధ్వజమెత్తారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు యువత ఓటుతో సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ ప్రజాపాలన చేకుండా పోలీస్ పాలన సాగించారని వారు ఎద్దేవా చేశారు. పోలీస్ 30 యాక్టు, 144 సెక్షన్లతో రాజ్యపాలన సాగించారని చెప్పారు. ఎన్నికల సమయంలో అధికారం కోసం కండువాలు మారుస్తున్న నేతలను ఎన్నికల నుంచి బహిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. సామాజిక న్యాయం కోసం బహుజన లెఫ్ట్ ఫ్రంట్‌ను ఆదరించాలని, అందుకు తెలంగాణ ప్రజలు మరోసారి పోరాటానికి సిద్ధం కావాలన్నారు.

చిత్రం.. సీఐటీయు రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో మాట్లాడుతున్న
చుక్కా రాములు, సాయిబాబా