తెలంగాణ

నేడు కేబినెట్ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం శుక్రవారం మధ్యాహ్నం పనె్నండు గంటలకు సచివాలయంలో జరుగుతుంది. కొత్త జిల్లాల ఏర్పాటు గురించి విస్తృతంగా చర్చించనున్నారు. జూన్ రెండున ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లోనే కొత్త జిల్లాల ప్రకటన చేయాలని ముఖ్యమంత్రి తొలుత భావించారు. వివిధ జిల్లాల్లో కొత్త జిల్లాల ఏర్పాటు కోసం ఆందోళనలు జరుగుతున్నాయి. జిల్లా కలెక్టర్లతో విస్తృతంగా చర్చించిన తరువాతనే కొత్త జిల్లాలపై నిర్ణయం తీసుకుంటారు. కొత్త జిల్లాల ఏర్పాటు కోసం హైదరాబాద్‌లో జిల్లా కలెక్టర్లతో విస్తృతంగా చర్చించేందుకు వర్క్‌షాప్ నిర్వహించనున్నారు. ఈ అంశం గురించి కేబినెట్‌లో ముఖ్యమంత్రి వివరిస్తారు. రెండేళ్ల కాలంలో తెలంగాణ ప్రభుత్వం సాధించిన అభివృద్ధిపై, వివిధ రంగాల్లో ముందుకు వెళ్లాల్సిన అంశాలపై చర్చిస్తారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజునే కాంట్రాక్టు ఉద్యోగులకు నియామక పత్రాలు అందజేయాలని తొలుత నిర్ణయించారు. వివిధ కారణాలతో గురువారం నియామక పత్రాలు ఇవ్వలేదు. దీనిపై కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటారు.