తెలంగాణ

ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదు గడువు పొడిగించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 11: శాసనమండలిలో ఉపాధ్యాయ, పట్ట్భద్రుల నియోజకవర్గాలకు జరిగే ఎన్నికలకు ఓటర్ల నమోదు గడువు పెంచాలని రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు స్థిత ప్రజ్ఞ అధ్వర్యంలో ప్రతినిధి బృందం గురువారం రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ను కలిసి వినతి పత్రం సమర్పించింది. ఓటర్ల నమోదుకు ప్రస్తుతం నవంబర్ 6 వరకు గడువు ఉందని స్థిత ప్రజ్ఞ గుర్తు చేసారు. అయితే ఉద్యోగస్తులంతా ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉండటంతో దీనిని డిసెంబర్ 31 వరకు పెంచాలని కోరారు. దీని వల్ల ఓటర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందన్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో విధులు నిర్వహించే ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఓటు నమోదు కోసం సంప్రదాయ పోస్టల్ బ్యాలెట్ ద్వారా కాకుండా ఆన్‌లైన్ ద్వారా ఓటు చేసే అవకాశం కల్పించాలని సూచించినట్టు స్థిత ప్రజ్ఞ తెలిపారు.

చిత్రం..రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి రజత్‌కుమార్‌కు వినతి పత్రం సమర్పిస్తున్న
సీపీఎస్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు స్థితప్రజ్ఞ