తెలంగాణ

విశ్వవ్యాప్తంగా తెలంగాణ సంస్కృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 11: తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని, జీవన విధానాన్ని విశ్వవ్యాప్తం చేసేలా బతుకమ్మ ఉత్సవాలు నిర్వహిస్తామని రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రావెంకటేశం తెలిపారు. బతుకమ్మ పండగ నిర్వహణ ఏర్పాట్లను తెలియచేసేందుకు సచివాలయంలో గురువారం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, బతుకమ్మ పండగ కోసం 20 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. ఒక్కో జిల్లాకు 15 లక్షల రూపాయలు ఇచ్చామని, విదేశాల్లో రెండుకోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు. ప్రజలు, ప్రభుత్వ సిబ్బంది స్వచ్ఛందంగా బతుకమ్మ పండగ ఉత్సవాల్లో పాల్గొనాలని పిలుపు ఇచ్చారు.
రాష్ట్రంలో తొలిసారి 12 సంవత్సరాలలోపు బాలికలకోసం అక్టోబర్ 6 నుండి 8 వరకు బొడ్డెమ్మ పండగ నిర్వహించామని వెంకటేశం తెలిపారు. బతుకమ్మ ప్రధాన పండగ 9 న ప్రారంభమైందని, 17 వరకు కొనసాగుతుందని తెలిపారు. బతుకమ్మ పండగను విశ్వవ్యాప్తం చేసేందుకు 25 దేశాలకు చెందిన బ్రహ్మకుమారీలు ముందుకు వచ్చారన్నారు. వివిధ దేశాలకు చెందిన 75 మంది బ్రహ్మకుమారీలు హైదరాబాద్‌లో బతుకమ్మ ఆడతారన్నారు. రష్యా దేశం నుండే 25 మంది బ్రహ్మకుమారీలు పాల్గొంటున్నారని తెలిపారు.
ఈ పర్యాయం బతుకమ్మ ఉత్సవాలు ప్రత్యేకంగా ఉండేలా, ఆకాశంలో, నేలపై, నీటిలో కూడా నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 17 న ఆకాశంలో బతుకమ్మను 50 మంది పారామోటరింగ్ ద్వారా బతుకమ్మ హరివిల్లులు కనిపించేలా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని బైసన్‌పోలో మైదానం, నెక్లెస్‌రోడ్డు పీపుల్స్ ప్లాజా, ఎన్‌టీఆర్ స్టేడియంలలో హర్ట్‌టైప్ బెలూన్ల ప్రదర్శన నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఉస్సేన్‌సాగర్‌లో 100 మంది మహిళలు పుట్టిలలో బతకుమ్మ ఆడేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.
బతుకమ్మ పండగ ఉత్సవాల్లో భాగంగా పీపుల్స్ ప్లాజాలో తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్‌ను 100 స్టాల్స్‌తో నిర్వహిస్తున్నామన్నారు. 16 వ తేదీన స్పైస్‌జెట్ విమానంలో బతుకమ్మ పండగ నిర్వహిస్తామన్నారు. శతాబ్ది, రాజధాని రైళ్లలో ప్రయాణించే మహిళలకు బుక్‌లెట్స్ పంపిణీ చేస్తామని వెంకటేశం తెలిపారు.
హైటెక్స్‌లో 1200 మంది అంధులైన మహిళలు, 500 మంది బధిరులు, దివ్యాంగ మహిళలు బతుకమ్మ ఉత్సవాల్లో భాగస్వామ్యం అవుతున్నారని వెంకటేశం తెలిపారు. మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల శిక్షణా సంస్థలో 300 మంది అఖిలభారత సర్వీస్ శిక్షణాధికారులతో పాటు తెలంగాణకు చెందిన అఖిల భారత ఉద్యోగులు, వారి కటుంబ సభ్యులు బతుకమ్మ సంబురాల్లో పాల్గొంటారన్నారు.
ఈ సందర్భంగా మహిళా సాధికారతపై ప్రజల్లో అవగాహన కల్పిస్తామని పర్యాటక శాఖ కమిషనర్ సునీతా భగవత్ తెలిపారు. భారత్‌లోని వివిధ నగరాలతోపాటు విదేశాల్లో బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు.
రవీంద్రభారతిలో ఈ నెల 16 వరకు ఫిల్మోత్సవ్ నిర్వహిస్తున్నామని, డాక్యుమెంటరీలను ప్రదర్శిస్తున్నామని సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ తెలిపారు. ఆర్ట్ క్యాంప్‌ను నెలరోజుల పాటు నిర్వహిస్తున్నామని, ఆర్ట్ గ్యాలరీలో 55 దేశాలకు చెందిన ఫోటోగ్రాఫర్లు తీసిన ఫోటోలు ప్రదర్శన ప్రారంభించామని వివరించారు. సద్దుల బతుకమ్మ రోజు లేజర్‌షో, ఫైర్‌వర్క్స్, కల్చరల్ కార్నివాల్ నిర్వహిస్తామని వివరించారు.
బ్రహ్మకుమారీల ద్వారా గ్లోబల్ కల్చరల్ ఫెస్టివల్, బతుకమ్మ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్టు సంతోష్ దీదీ తెలిపారు. ఈ కార్యక్రంమలో పర్యాటక అభివృద్ది సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
చిత్రం.. మీడియా ప్రతినిధులతో మాట్లాడుతున్న వెంకటేశం