తెలంగాణ

పొత్తు చారిత్రక అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 11: మహాకూటమిలో పొత్తులు సీట్ల కోసం కాదని, అమరుల ఆకాంక్షలే తమ ప్రధాన అజెండా అని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన అందించడమే తమ లక్ష్యమని గురువారం ఇక్కడ పేర్కొన్నారు. పొత్తులు బలంగా ఉండాలంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణి అవసరమన్నారు. మహాకూటమిలో అన్ని అంశాలను త్వరగా తేల్చాలని కాంగ్రెస్ పార్టీకి సూచించారు. న్యాయవాది ప్రహ్లాద్ గురువారం కోదండరామ్ సమక్షంలో టీజేఎస్‌లో చేరారు.‘బలమైన అజెండాతో ప్రజల ముందుకు వెళ్తున్నాం’అని అన్నారు. సీట్ల సర్దుబాటు, పొత్తుల అంశంపై సానుకూల నిర్ణయం ఉంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. లీకులు, అసత్య ప్రచారం వల్ల కొంత గందరగోళానికి దారి తీస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాగా బీజేపీతో కలిసి పని చేసే ఆలోచన ఇప్పటి వరకులేదని ఆయన అన్నారు. తాను ఎన్నికల్లో పోటీచేయనని ఎక్కడా చెప్పాలేదని స్పష్టం చేసారు. ఎక్కడి నుంచి పోటీ చేసేది పార్టీ నిర్ణయిస్తుందన్నారు. మహాకూటమిలో గౌరవప్రదమైన భాగస్వామ్యాన్ని తాము కోరుకుంటున్నామని ఆయన తెలిపారు. ఉమ్మడి ప్రయోజనాల దృష్ట్యా అన్ని విషయాలు తొందరగా తేల్చాలని కాంగ్రెస్‌కు సూచించినట్టు తెలిపారు.
తాము కూటమిలో ప్రధానంగా మూడు అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఉమ్మడి కార్యాచరణ, ప్రణాళిక అమలు, గౌరవప్రదమైన భాగస్వామ్యమన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో పొత్తులు చారిత్రక అవసరమని కోదండరామ్ అభిప్రాయపడ్డారు. దీని కోసం తమ వైపు నుంచి ప్రయత్నం చేస్తున్నామన్నారు.
చిత్రం..తెలంగాణ జన సమితి కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడుతున్న
ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరామ్, పార్టీలో చేరిన న్యాయవాది ప్రహ్లాద్