తెలంగాణ

చిత్రం- భళారే- విచిత్రం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, అక్టోబర్ 11: సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహా భార్య పద్మినీరెడ్టి రాష్ట్రం, కాదు దేశ ప్రజలను నివ్వెరపరిచే విధంగా రాజకీయ హైడ్రామా కొనసాగించి అందరినీ ఆశ్చర్యచకితులను చేశారు. ముందస్తు ఎన్నికల వేడి రోజు రోజుకు రాజుకుంటున్న సమయంలో గురువారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, పార్టీ జాతీయ కార్యదర్శి మురళీధరరావు, తదితరుల సమక్షంలో కాషాయం కండువా కఫ్పుకున్న పద్మిని సాయంత్రానికి తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. సంగారెడ్డిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన క్షణాల విలేఖరుల సమావేశంలో తన భర్తకు తలెత్తనున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వెల్లడించారు.
అందోల్ నియోజకవర్గం కాంగ్రెస్ కార్యకర్తల నుంచి ఇంతటి వ్యతిరేకత, వత్తిడి వస్తుందని తాను ఊహించలేదని వాపోయారు. అనుకోకుండా బీజేపీ కండువా ధరించాల్సి వచ్చిందని సరిపుచ్చుకున్నారు. ప్రత్యక్ష రాజకీయ అనుభవం లేని పద్మినీరెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం కలవరపాటుకు గురిచేసింది. ఇదిలావుంటే పద్మిని ఉన్న ఫలంగా కాంగ్రెస్ పార్టీని, భర్తను ధిక్కరించి బీజేపీలో చేరడానికి గల కారణాలు ఏమిటో, సదరు వ్యక్తుల పరిస్థితి ఏమిటీ అన్న చర్చకు తెరలేచింది. చాలాకాలంగా రాజకీయ అరంగ్రేటం చేయాలని చూస్తున్న ఆమె ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు మంచి ట్విస్ట్ ఇచ్చారని చెప్పవచ్చు. వరుసగా మూడు పర్యాయాలు ఓటమి చెంది రాజకీయ భవిషత్తు ప్రమాదంలో పడిన సందర్భంలో 2004 ఎన్నికల్లో భర్తను గెలిపించాలని నియోజకవర్గంలో ఊరూరా తిరిగి ప్రచారం చేసిన పద్మిని రాజకీయ ప్రకంపనలు సృష్టించారు. ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్‌లో రాజకీయ దుమారం సృష్టించిన పద్మిని రెడ్డి తిరిగి కాంగ్రెస్ కండువా ధరించడంతో కథ సుఖాంతమైంది. టీ కప్పులో తుఫానుగా దామోదర్ కుటుంబంలో నెలకొన్న రాజకీయ దుమారం ఎంత మేరకు సద్దుమణుగుతుందో చూడాల్సిందే.

చిత్రం..గురువారం ఉదయం పద్మినిరెడ్డికి కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానిస్తున్న లక్ష్మణ్