తెలంగాణ

ఝాన్సీది హత్యే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నకిరేకల్, జూన్ 2: నల్లగొండ జిల్లావ్యాప్తంగా సంచలనం సృష్టించిన నకిరేకల్‌కు చెందిన బిటెక్ విద్యార్థిని గూడూరు ఝాన్సీరాణి (21) మృతి మిస్టరీని పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. కట్టుకున్న భర్త, కన్నతల్లి కలిసి ఆమెను హత్య చేసినట్లు నిర్థారించారు. ఈ హత్య కేసులో ఏడుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు నల్లగొండ డిఎస్పీ ఎస్.సుధాకర్ తెలిపారు. తనకు ఇష్టంలేని పెళ్లి చేశారని తల్లి, భర్త వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఝాన్సీ ఈనెల 23న సరూర్‌నగర్ పోస్ట్ఫాసు నుంచి పోలీస్ అధికారులకు పోస్టు ద్వారా లేఖను పంపండంతో నకిరేకల్ సిఐ జె.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలు పెట్టారు. గూడూరు విజయేందర్‌రెడ్డి తన మేనమరదలు ఝాన్సీరాణిని వివాహం చేసుకోవాలన్న ఆశతో అత్త అయన గుర్రం పద్మకు రూ.4 లక్షలు అప్పుగా ఇచ్చాడు. కట్నం ఇవ్వలేని అత్త నిస్సహాయ పరిస్థితిని ఆసరాగా చేసుకొని ఝాన్సీని తనకిచ్చి పెళ్లిచేయాలని ఒత్తిడి తెచ్చాడు.
దీంతో ఝాన్సీ తల్లి పద్మ డబ్బులు చెల్లించలేక ఆగస్టు 22, 2014న నల్లగొండ మండలం దీపకుంటకు చెందిన గూడూరు విజయేందర్‌రెడ్డికి ఝాన్సీకి ఇష్టం లేకున్నా వివాహం జరిపించింది. ఆ తరువాత ఝాన్సీని శారీరకంగా వేధిస్తుండడంతో ఇంజనీరింగ్ చివరి సంవత్సరం అయ్యేవరకు తనను శారీరకంగా ఇబ్బంది పెట్టవద్దని వేడుకుంది. ఈనెల 23న చివరి సంవత్సరం పరీక్షలు ముగియడంతో భర్త విజయేందర్‌రెడ్డి హైదరాబాద్‌కు వెళ్లి హాస్టల్‌లో ఉంటున్న ఝాన్సీని వీడ్కోలు సమావేశానికి కూడా వెళ్లనీయకుండా బలవంతంగా నకిరేకల్‌కు తీసుకొచ్చాడు. అదేరోజు రాత్రి ఝాన్సీపై శారీరకంగా దాడిచేయడానికి ప్రయత్నించగా ఆమె ప్రతిఘటించింది.
ఈ నెల 24న తన కుమార్తెకు ఎంత చెప్పినా భర్త విజయేందర్‌రెడ్డితో సంసారం చేయకపోవడంతో విసుగుచెందిన తల్లి పద్మ, అల్లుడు విజయేందర్‌రెడ్డికి రూ.120 లు ఇచ్చి పురుగుల మందు తీసుకురమ్మని చెప్పింది. స్థానికంగా ఉన్న ఓ ఫర్టిలైజర్ దుకాణంలో మోనోక్రోటోపాస్ పురుగుల మందు తీసుకొచ్చి సాయంత్రం 4గంటలకు భర్త విజయేందర్‌రెడ్డి, తల్లి పద్మ ఝాన్సీ నోట్లో బలవంతంగా పోయడంతో ఆమె అపస్మారకస్థితిలోకి వెళ్లి మృతి చెందింది. ఝాన్సీ హత్య విషయం ఎవరికీ తెలియకుండా గోప్యంగా ఉంచేందుకు మృతదేహాన్ని నల్లగొండ మండలం దీపకుంటకు తరలించి ఈ నెల 25న దహన సంస్కారాలు చేశారు. ఈ కేసులో ఝాన్సీ భర్త గూడూరు విజయేందర్‌రెడ్డి, ఆమె తల్లి గుర్రం పద్మ, అన్న గుర్రం శివశంకర్‌రెడ్డి, మామ గూడూరు జానకిరాంరెడ్డి, అత్త గూడూరు జయమ్మ, మరిది గూడూరు అజేందర్‌రెడ్డి, పెద్దనాన్న కుమారుడు గుర్రం కిరణ్‌రెడ్డిలను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు డిఎస్పీ తెలిపారు. దీనిపై 302, 201సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశామన్నారు.

చిత్రం హత్యకేసు వివరాలను వెల్లడిస్తున్న డిఎస్పీ సుధాకర్.
హత్యకు గురైన ఝాన్సీ (ఫైల్‌ఫొటో)