తెలంగాణ

తెలంగాణ సాధనలో బిజెపి పాత్ర చరిత్రాత్మకమైంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 2: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత గడచిన రెండేళ్లలో కేంద్ర ప్రభుత్వం రూ.2లక్షల కోట్ల రూపాయలు ఇచ్చిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. తెలంగాణ సాధనలో బిజెపి పాత్ర చారిత్రాత్మకమైందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా గురువారం పార్టీ కార్యాలయంలో లక్ష్మణ్ జాతీయ జెండాను ఎగురవేశారు. బిజెపి శాసనసభాపక్ష నాయకుడు జి కిషన్‌రెడ్డి, శాసనమండలి సభ్యుడు ఎన్ రామచంద్రరావు, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రరారెడ్డి, ఎన్‌వివిఎస్ ప్రభాకర్, జాతీయ నాయకులు నల్లు ఇంద్రసేనారెడ్డి, నాగం జనార్ధనరెడ్డి, చింతా సాంబమూర్తి తదితర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ తెలంగాణ పోరాటం అమరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిందని చిన్న రాష్ట్రాల వల్ల పరిపాలనా సౌలభ్యం, త్వరితగతిన అభివృద్ధి జరుగుతుందని భావించిన బిజెపి మొదటి నుండి తెలంగాణకు అనుకూలంగా ఉందన్నారు. 1969లో తెలంగాణ కోసం ఎంతో మంది అమరులయ్యారని, స్వతహాగా బిజెపి ఉద్యమాలు చేస్తూ, తెలంగాణ రాజకీయ జెఎసిలో భాగస్వామ్యం అవుతూ పోరాటాలను నిర్వహించిందని అన్నారు.