తెలంగాణ

కల్వకుర్తి తెరాసలో కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, అక్టోబర్ 15: నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలోని కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి తెరాస అధినేత కేసీఆర్.. మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ను వచ్చే ఎన్నికల్లో రంగంలోకి దింపడానికి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడాన్ని పార్టీలోని ఓ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. వ్యతిరేకించడమే కాకుండా తెరాస ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డిని స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దించేందుకు కూడా కార్యకర్తలు ఏకంగా సమావేశాలు నిర్వహించుకుని కసిరెడ్డి నారాయణరెడ్డిపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నారు. అయితే కసిరెడ్డి నారాయణరెడ్డి కూడా గత మూడేళ్ల నుండి నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తూ నియోజకవర్గంలో అంతా తానై టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలకు చేదోడువాదోడుగా ఉంటున్నారు. ప్రత్యేకంగా నియోజకవర్గంలో ఆయనకంటూ ఓ వర్గం ఉండడంతో తమ నాయకుడు ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడని భావించారు. కానీ కేసీఆర్ నిర్ణయంతో ఖంగుతిన్నారు. కేసీఆర్ నిర్ణయాన్ని కసిరెడ్డి వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జైపాల్‌యాదవ్ అభ్యర్థిత్వాన్ని మార్చాలంటూ కేసీ ఆర్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను చక్కదిద్దాలని కేటీఆర్ చేసిన ప్రయత్నాలు ఫలించలేకపోయాయి. గత రెండురోజుల క్రితం మంత్రి కేటీఆర్ పర్యటన నియోజకవర్గంలో ఉన్నప్పటికిని ఇక్కడి పరిస్థితుల దృష్ట్యా వాయిదా వేసుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా సోమవారం నియోజకవర్గంలోని వెల్దండ, కడ్తాల మండలాలకు సంబంధించిన వందలాది మంది తెరాస కార్యకర్తలు హైదరాబాద్‌కు బయలుదేరి కసిరెడ్డి నారాయణరెడ్డితో భేటీ అయ్యి ఎట్టి పరిస్థితుల్లో స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగాలని ఒత్తిడి తెచ్చారు. మంగళవారం సైతం తలకొండపల్లి, ఆమనగల్లు, కల్వకుర్తి మండలాలకు సంబంధించిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి వర్గీయులు భేటీ కానున్నారు. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని తన అనుచరులతో భేటీ సందర్భంగా రెండురోజుల్లో పోటీలో ఉండేది లేనిది స్పష్టత ఇస్తానని ఆయన వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లో రంగంలో ఉండాలని కార్యకర్తలు మాత్రం డిమాండ్ చేశారు. ఈ కారణంగా కల్వకుర్తి తెరాసలో కల్లోలం మొదలైంది. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని టీఅర్‌ఎస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డిపై తన అనుచరులు, జైపాల్‌యాదవ్ అసమ్మతివాదులు ముక్కుమ్మడిగా పట్టుబడుతుండడంతో నారాయణరెడ్డి డైలామాలో పడ్డారు. టీఅర్‌ఎస్ పార్టీ నుంచి కల్వకుర్తి అసెంబ్లీ టీకెట్ అశించి భంగపడి అలకబూనిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డికి నియోజకవర్గంలోని తెరాస కార్యకర్తల నుండి తీవ్ర ఒత్తిడి ఉండడంతో ఆయన ఎటూ తెల్చుకోలేకపోతున్నారు. ఏది ఎమైనా తప్పనిసరిగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాల్సిందేనని అనుచరులు పట్టుబడినట్లు సమాచారం. ఇందుకు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి మాత్రం అడకత్తెరలో పోకచెక్కలాగ తన పరిస్థితి తయారైందని, ఇలాంటి పరిస్థితుల్లో తొందరపడవద్దని కోరారు.