తెలంగాణ

కేసీఆర్‌కు హఠావో.. కాంగ్రెస్‌కు జితావో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, అక్టోబర్ 15: తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 7న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు హఠావో... కాంగ్రెస్‌కు జితావో అని ఆలిండియా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఎన్నికల పరిశీలకుడైన ఆర్‌సీ.కుంతియా కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రానికి హెలికాప్టర్‌లో వచ్చిన కాంగ్రెస్ ఎఐసీసీ, టీపీసీసీ నేతలు కామారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ ఉమ్మడి జిల్లాలకు సంబందించిన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు, పార్టీ ప్రముఖులు, క్రీయాశీలక కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కుంతియా మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ 20వ తేదీ ఉదయం మొదట హైదారాబాద్‌లోని చార్మినార్ వద్ద రాజీవ్ సద్భావన యాత్రలో పాల్గొంటారని, అక్కడి నుండి రెండు గంటల సమయంలో బైంసా సభకు హాజరు అవుతారని, సభ అనంతరం మూడు గంటలకు కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగే ఎన్నికల బహిరంగ సభలో పాల్గొని గంటపాటు ఆయన ప్రసంగిస్తారని అన్నారు. రాహుల్ సభ కోసం ప్రజలందరు ఎదురు చూస్తున్నారని అన్నారు. ఈసభను విజయవంతం చేసేందుకు మూడు లక్షల మంది స్వచ్చందంగా తరిలివచ్చే విధంగా పార్టీ టిక్కెట్‌లు అశించే నాయకులు, జిల్లా పార్టీల అధ్యక్షుడు, నియోజక వర్గాల అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, కృషి చేయాలని పిలుపునిచ్చారు. కనీవినీ ఎరగని రీతలో ఈ సభను విజయవంతం చేయాలని, తాము ఈ సభకు సంబంధించి అన్ని విధాల పరిశీలిస్తామని.. ఎవరు పనిచేస్తున్నారు, ఎవరు చేయడం లేదన్న విషయాలను కూడా గమనిస్తుంటామని అన్నారు. ఈ సభ కోసం స్వచ్ఛందంగా పనిచేసిన ప్రతి నాయకునికి, కార్యకర్తకు గుర్తింపు ఇస్తామని అన్నారు. సభల కోసం టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ లక్షల కోట్ల రూపాయల ధనం ఖర్చు చేస్తున్నారని, కాని కాంగ్రెస్ పార్టీ సభలకు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం సోనియాగాంధీ వల్లే సాధ్యం అయ్యిందని, తెలంగాణ వచ్చిన తరువాత టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టి అధికారంలో వచ్చిన తరువాత ఏ ఒక్క హామీని అమలు చేయలేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత బంగారు తెలంగాణ రాష్ట్రం సాధిస్తానని చెప్పుకున్న కేసీఆర్ తన కుటుంభాన్ని మాత్రం బంగారు కుటుంభంగా చేసుకున్నారని ఆరోపించారు. లక్షలాది మంది నిరుద్యోగులు రోడ్లపై తిరుగుతుంటే టీఆర్‌ఎస్‌కు అసలే పట్టింపులేకుండా పోయిందన్నారు.
కుప్పకూలనున్న టీఆర్‌ఎస్: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
సోనియగాంధీ వల్ల తెలంగాణ రాష్ట్రం వస్తే, ప్రజలకు దగుల్‌బాజీ మాటలు చెప్పి, అధికారంలో వచ్చిన టీఆర్‌ఎస్ తెలంగాణ ప్రజలకు చేసింది ఏమి లేదని ఇక టీఆర్‌ఎస్ పతనం మొదలైందని, టీఆర్‌ఎస్ కుప్పకూలడం ఖాయం అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జోస్యం చెప్పారు. ఉమ్మడి జిల్లా కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ కుటుంబం తప్ప అనే మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు ప్రముఖ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధం అవుతున్నారని అన్నారు. కేసీఆర్ ఒక మోసగాడని, ఎన్నికల్లో చెప్పింది ఏం చేయాలేదని ఆరోపించారు. కోట్లాది ప్రజాధనం వృధా చేసి, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడని ఆరోపించారు. కాంట్రాక్టర్‌ల కమీషన్‌ల కోసమే కేసీఆర్ కుటుంబం ఉందని, తెలంగాణ రాష్ట్రం వల్ల బాగుపడిన కుటుంబం ఏదైనా ఉందంటే అది కేసీఆర్ కుటుంబమేనని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని తొక్కెసి, హక్కులను కాలరాశారని ఆరోపించారు. ఈ దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడేందుకు అందరు కలిసి రావాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ మోడికి చెంచాగా పనిచేస్తున్నాడని, టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే బీజేపీకి ఓటు వేసినట్లేనని అన్నారు. రాష్టప్రతి, ఉపరాష్టప్రతి ఎన్నికల్లో కేసీఆర్ బీజేపీకి సహరించిన విషయం అందరికి తెలుసని అన్నారు. ముస్లీంలకు 12శాతం రిజర్వేషన్‌లు ఇస్తానని మోసం చేశానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే రైతులకు 2లక్షల రుణమాఫి, నిరుద్యోగులకు 3వేల నిరుద్యోగభృతి, మహిళ సంఘాలకు లక్ష రూపాయల గ్రాంటు, డ్వాక్రా గ్రూపులకు 10లక్షల రూపాయల వడ్డీ లేని రుణం, వెయ్యి రూపాయల పెన్షన్‌ను 2వేలకు పెంచడం, వికలాంగులకు 3వేల రూపాయల పించన్, 65ఏళ్లకు ఉన్న వృద్దాప్య పించన్ 58ఏళ్లకే ఇవ్వడం జరుగుతోందని అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాల భర్తీ, మెగా డిఎస్సీ వేస్తామని అన్నారు. ఏడు కిలోల సన్నబియ్యంతో పాటు 9రకాల నిత్యవసర వస్తువులను రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తామని అన్నారు. దళితులకు గిరిజనులకు ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తామని అన్నారు. తెల్లరేషన్‌కార్డుపై ఏడాదికి ఆరు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని అన్నారు. దళిత గిరిజనులకు 200యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా ఇస్తామని అన్నారు.

చిత్రం..కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉమ్మడి జిల్లాల కాంగ్రెస్ పార్టీ సమావేశంలో మాట్లాడుతున్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కుంతియా