తెలంగాణ

కేసీఆర్ బెదిరించారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 16: రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు తనను బెదిరించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే. లక్ష్మణ్ పేర్కొన్నారు. ఇందిరాపార్కును తరలింపును అడ్డుకుంటున్నందుకు తనను కేసీఆర్ బెదిరించారని చెప్పారు. మంగళవారం నాడు ఇందిరాపార్కులో అగ్నిప్రమాదం సంభవించిందనే సమాచారం తెలుసుకున్న డాక్టర్ కే. లక్ష్మణ్ అక్కడికి వచ్చారు. మున్సిపల్ అధికారులు ఏదో కారణాలు చెప్పబోగా, లక్ష్మణ్ వారిని గట్టిగా నిలదీశారు. అధికారులు ఏం అడిగినా సరైన సమాధానం ఇవ్వడం లేదని, దిగువ సిబ్బంది తప్పు చేస్తే వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవల్సిన ఉన్నతాధికారులు తమకేమీ తెలియనట్టు వ్యవహరించడం దారుణమని అన్నారు. పెద్ద ఎత్తున పార్కులో మంటలు చెలరేగడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారని, ఇలా జరగడం ఇదే ప్రథమం కాదని, గతంలో తొమ్మిదిసార్లు భారీ అగ్ని ప్రమాదాలు సంభవించినా, అధికారుల శైలిలో మార్పు రావడం లేదని అన్నారు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో వాకర్స్ భయాందోళనకు గురై పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. పదే పదే పార్కులో మంటలు చెలరేగడంపై వాకర్స్, స్థానికులు ఆందోళనకు దిగారు. అగ్ని ప్రమాదాలపై అధికారులకు ఎన్నిమార్లు చెప్పినా పట్టించుకోలేదని వారు ఆరోపించారు. సమాచారం తెలుసుకున్న లక్ష్మణ్ స్థానికులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తానని అన్నారు. అంతలో అక్కడకు చేరుకున్న మున్సిపల్ అధికారులను లక్ష్మణ్ నిలదీశారు.