తెలంగాణ

కులరహిత సమాజ సాధనకు పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 22: కులరహిత సమాజ సాధనకు అంతా కలిసి ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని, ఇందుకు అవసరమైతే దళితులు మిగిలిన వర్గాలనూ కలుపుకుంటూ పోవాలని సోమవారం నాడిక్కడ జరిగిన దళిత స్ర్తి శక్తి, ఆఫీసర్సు ఫోరం సదస్సులో పలువురు వక్తలు పేర్కొన్నారు. ఈ సమావేశానికి దళిత స్ర్తి శక్తి జాతీయ కన్వీనర్ ఝాన్సీ గడ్డం అధ్యక్షత వహించగా, కాకి మాధవరావు (ఐఎఎస్), మురళీ (ఐఎఎస్), వినోద్ (ఐఎఫ్‌ఎస్), కంచె ఐలయ్య, గోపాలకృష్ణ (ఎసిఇఎస్ డైరెక్టర్) , డాక్టర్ సిద్దోజీ, ప్రొఫెసర్ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. కులం సర్ట్ఫికేట్లు జారీ చేయకముందు ఈ సమాజంలో కులం లేదా అని కొంత మంది ప్రశ్నించారు. కులం పుట్టుకతోనే వస్తుంది కదా అది లేకుండా పుట్టుకే లేదన్న దానితోనే ఆధారపడినపుడు కులం ఎలా పోతుందని అంతా వాదిస్తుంటారని, కానీ నిజాయితీగా ఉద్యమిస్తే కులం పోతుందని అన్నారు. ఏ కోణంలో చూసినా కులం భూతమై కూర్చుందని, కులతత్వం , కులకట్టుబాట్లు రెండూ మన దేశంలో పాతుకుపోయాయని , జాతి ఎదుగుదలకు ఇది తూట్లు పొడుస్తుందని , అంబేద్కర్ చెప్పినట్టు కులనిర్మూలన జరగాలని, కులాన్ని కాల్చి బూడిద చేయాలని కాకి మాధవ రావు అన్నారు.
మురళీ మాట్లాడుతూ రాజ్యాధికారం కంటే ముందు కులాన్ని పారద్రోలడం కోసం ఎస్సీ ఎస్టీలు, బీసీలు కలవాలని అన్నారు. అన్ని రంగాల్లో కులం రాజ్యమేలుతోందని డాక్టర్ సుదర్శన్ పేర్కొన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థల్లో దళిత పిల్లలు కులవివక్షకు గురవుతున్నారని, ఈ కుల విద్వేషం వల్లనే బాధితుడినే నిందితుడిగా చేస్తున్నారని పేర్కొన్న వక్తలు ఇటీవల జరిగిన ప్రణయ్ హత్యను ప్రస్తావించారు. హత్యను ఖండించి నిందితుడ్ని తప్పుపట్టాల్సిన సమాజం, నిందితుడ్ని సమర్ధించి, బాధితుడ్ని తప్పుపట్టడం వెనుక కుల దురహంకారమే ఉందని అన్నారు. లైంగిక సంబంధాలకు లేని కులం, పెళ్లిళ్లకు మాత్రం అడ్డు వస్తోందని వారు వ్యాఖ్యానించారు. ప్రణయ్ హత్యకు సంబంధించిన కేసు న్యాయపరమైన అంశాలను దళితస్ర్తి శక్తి, ఆఫీసర్సు ఫోరం పర్యవేక్షిస్తాయని ఈ సందర్భంగా నిర్ణయించారు. కులాంతర వివాహాల పరిరక్షణ చట్టం, ప్రొత్సాహకాలకు సంబంధించిన అంశాలను అన్ని జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలూ తమ మేనిఫెస్టోల్లో చేర్చాలని తీర్మానించారు. కులరహిత సమాజ ప్రచారోద్యమాన్ని చేపట్టాలని, ఈ ఉద్యమంలో భావసారూప్యం ఉన్న దళితేతరులను మమేకం చేయాలని అన్నారు. రాజ్యాంగేతర శక్తులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. మీడియా తన పాత్రను మేథోమథనం చేసుకోవాలని దళిత స్ర్తి శక్తి జాతీయ కన్వీనర్ ఝాన్సీ గెడ్డం అన్నారు.