తెలంగాణ

పుల్‌బ్రైట్ స్కాలర్‌షిప్‌లను పొందండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 22: యుఎస్ ఇండియన్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ద్వారా అందిస్తున్న ఫుల్ బ్రైట్ స్కాలర్‌షిప్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అడం గ్రోస్కే పేర్కొన్నారు. భారతీయులు ఫుల్ బ్రైట్ స్కాలర్‌షిప్‌నకు పోటీ పడాలని ఆమె సూచించారు. సోమవారం నాడు ఆమె ఇఫ్లూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఇ సురేష్‌కుమార్‌ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ఫుల్ బ్రైట్ స్కాలర్‌షిప్ గురించి చర్చించారు. వర్శిటీ, యుఎస్‌ఐఇఎఫ్‌తో కలిసి ఉమ్మడిగా సదస్సులు, సమావేశాలు, వర్కుషాప్‌లు నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే వీలైతే యూజీ, పీజీ విద్యార్ధులకు సైతం పున:శ్చరణ తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఆమె రీజనల్ ఆఫీసర్ డాక్టర్ మోనికా సెటియాతో కలిసి ఇఫ్లూ బోధన సిబ్బందితో సమావేశమయ్యారు.
డీసెట్ మిగులు సీట్లకు వెబ్ ఆప్షన్లు
రెండో దశ అనంతరం మిగిలి పోయిన డీసెట్ సీట్లకు ఈ నెల 25 నుండి 27 వరకూ వెబ్ ఆప్షన్లను నమోదు చేయవచ్చని పాఠశాల విద్యాశాఖాధికారులు సూచించారు. వెబ్ ఆప్షన్లు ముగిసిన వెంటనే 30 వ తేదీన సీట్ల కేటాయింపు జరుగుతుందని, సీట్లు పొందిన వారు ఈ నెల 31న ఆయా డైట్‌లకు వెళ్లి రిపోర్టు చేయాలని సూచించారు.
నిజాయితీ పట్టుదల ఉండాలి
నిజాయితీ , ధైర్యం, పట్టుదల , సేవాదృక్పథం విలువలు సమపాళ్లలో ఉంటేనే సివిల్ సర్వీసెస్ సాధ్యమని సీనియర్ ఐఎఎస్ అధికారి అనిత రాజేంద్ర పేర్కొన్నారు. ఎస్ ఆర్ శంకరన్ ఐఎఎస్ 84వ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గురుకులాల కార్యదర్శి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ అధికారి వై సత్యనారాయణ కూడా పాల్గొన్నారు. సత్తాతో పాటు మంచి వ్యక్తిత్వాన్ని అలవరచుకోవాలని, అలాంటి అధికారి శంకరన్ అని చెప్పారు. ఈ సందర్భంగా అబ్దుల్ కలాం పేరిట లైబ్రరీని ప్రవీణ్‌కుమార్, మహాత్మాగాంధీ పేరిట నిర్మించిన హాల్‌ను వై సత్యనారాయణ ప్రారంభించారు. మదర్ థెరిస్సా హాలును నంద్యాల నర్సింహారెడ్డి, భగత్‌సింగ్ హాల్‌ను కే సురేందర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన కళలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కే. సతీష్‌కుమార్, ఎమాన్యుయేల్ సందీప్, మనే్న జగన్నాధ్, ప్రభాకర్ చౌటీ, సైదేశ్వర్ రావు, పీ శివకుమార్, కే సతీష్‌కుమార్, పి ప్రభాకర్, ఎం జ్యోతి, ఎస్ అనురాధ తదితరులు పాల్గొన్నారు.
చిత్రం..ఇఫ్లూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సురేష్‌కుమార్‌ను కలుసుకున్న అడం గ్రోస్కే