తెలంగాణ

ఆశీర్వదించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తన పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకుంటున్న నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
.......................

పెన్షన్ రాలేదని
మాజీ సర్పంచ్ ఆత్మహత్య

తాడ్వాయి, జూన్ 3: నెలల తరబడి తిరుగుతున్నా తనకు పెన్షన్ రావడం లేదని తీవ్ర మనస్తాపానికి గురై ఓ మాజీ సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్ జిల్లా తాడ్వాయలో జరిగింది. భిక్కనూరు సిఐ శ్రీధర్‌కుమార్ కథనం ప్రకారం.. మండలంలోని దేవాయిపల్లి గ్రామానికి చెందిన పైడి నర్సింహారెడ్డి (66) 7 సంవత్సరాల పాటు ఆ గ్రామంలో గ్రామ సర్పంచ్‌గా పనిచేశాడు. 20 ఏళ్ల క్రితం 30 ఎకరాలకు భూస్వామి అయిన పైడి నర్సింహారెడ్డి రాజకీయాల కోసం ఉన్న ఆస్తంతా పోగొట్టుకున్నాడు. గత 10నెలల నుండి తనకు పెన్షన్ అందించాలని పలుమార్లు అధికారులకు విన్నవించినా ఎవరూ స్పందించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన నర్సింహారెడ్డి పురుగుల మందు తాగి గురువారం రాత్రి మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయం ఆవరణలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య స్వరూప 15 ఏళ్ల క్రితం విడిపోయి మెదక్ జిల్లాలోని సరంపల్లి గ్రామంలోని తన తల్లిగారింటి వద్ద ఉంటోందన్నారు. మృతుడి మేనల్లుడు సంజీవరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు.

ఎస్‌బిహెచ్ డిపాజిట్ల స్వాహా కేసులో మరో ముగ్గురి అరెస్టు

హైదరాబాద్, జూన్ 3: రాజధానిలోని మల్కాజగిరి ఎస్‌బిహెచ్ బ్రాంచిలో కోట్లాది రూపాయల ఫిక్స్‌డ్ డిపాజిట్ల ఫ్రాడ్ కేసులో బ్యాంకు మేనేజర్ డి నీరజ శ్రీనివాస్, మరో ఇద్దరు వ్యక్తులు ఎం వెంకటేష్, మజిద్ ఖాన్ అదిల్ ఖాన్‌ను సిబిఐ పోలీసులు అరెస్టు చేసి సిబిఐ కోర్టులో హాజరుపరచగా, జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపారు. ఈ కేసును సిబిఐ గత ఏడాది డిసెంబర్ 17వ తేదీన నమోదు చేసి దర్యాప్తు చేసింది. ఈ కేసులో 8.45 కోట్ల డిపాజిట్లను నిందితులు కుమ్మక్కై స్వాహా చేశారని సిబిఐ అభియోగం.

ఎస్సై ప్రిలిమినరీ పరీక్షలో బిటెక్ గ్రాడ్యుయేట్ల హవా
23,526మంది బిటెక్‌లు అర్హత

హైదరాబాద్, జూన్ 3: తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్వహించిన ఎస్సై సివిల్ ప్రిలిమినరీ పరీక్షల్లో మొత్తం 88875 మంది అర్హత సాధించగా, ఇందులో 23526 మంది బిటెక్ గ్రాడ్యుయేట్లు ఉన్నారని రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటనలో తెలిపింది. 12మంది పిహెచ్‌డిలు, 2335 మంది ఎంటెక్, 5498మంది ఎంబిఏలు, 4733మంది ఎంఎస్‌సి చదివినవారు అర్హత సాధించారని పేర్కొన్నారు.