రాష్ట్రీయం

అధికారుల గుండెల్లో ‘జన్మభూమి’ రైళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, డిసెంబర్ 25: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చేనెల 2వ తేది నుంచి తిరిగి ప్రారంభంకానున్న జన్మభూమి కార్యక్రమంతో అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల వద్దకే అధికారులు వెళ్లి అర్జీలు స్వీకరించి, సమస్యలు పరిష్కరించాల్సి ఉంది. రేషన్‌కార్డులు, పెన్షన్లు, శాశ్వత గృహాలు, ఇళ్ల స్థలాలు, వౌలిక సదుపాయాల్లో భాగమైన రోడ్ల నిర్మాణాలు , తాగునీటి సమస్య, విద్యుత్ వంటి సమస్యలు ఇప్పటికే పలు గ్రామాల్లో తిష్టవేసి ఉన్నాయి. ఈ నేపథ్యంలో పదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత అధికారపార్టీ నేతలు వైకాపానే టార్గెట్ చేసుకుని ఎదురుదాడికి సన్నద్ధమవుతున్నారు. కాంగ్రెస్ హయాంలో వారి పార్టీకి చెందిన కార్యకర్తలు పొందిన లబ్దిని రద్దుచేయించి తమ అనుచరగణానికి ఇప్పించేందుకు జన్మభూమి కార్యక్రమంలో అర్జీలు ఇప్పించడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. కడపజిల్లాలో సర్పంచ్‌లు మండల పరిషత్ అధ్యక్షులు, జడ్పిటిసిలు, ఎంపిటిసిలు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు అధికసంఖ్యలో వైకాపా నేతలే ఉండటంతో ప్రోటోకాల్ ప్రకారం వారినే వేదికపైకి పిలవాల్సి ఉంది. అయితే ప్రభుత్వం తమ సొంతపార్టీ కార్యకర్తలతో ఏర్పాటుచేసిన జన్మభూమి కమిటీలకు కూడా క్షేత్రస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది.
ప్రభుత్వం అర్హులకు సంక్షేమపథకాలు అందేందుకు ప్రవేశపెట్టిన ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, రెవెన్యూ అధికారుల విచారణ ఉన్నా నేటికీ ఎవరు అర్హులు, ఎవరు అనర్హులో అధికారులు తేల్చలేకపోతున్నారు. అధికారులు కూడా ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తుండటంతో గ్రామాల్లో పలు సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం అధికారులకు టార్గెట్ విధించి ప్రతి గ్రామపంచాయితీకి ఒక ప్రత్యేక అధికారిని నియమించింది. వారు రెగ్యులర్ విధులు నిర్వర్తిస్తూ గ్రామాల అభివృద్ధి కూడా చూడాల్సివుంది. జన్మభూమి కార్యక్రమంలో రేయింబవళ్లు అధికారులు క్షణం తీరికలేకుండా ప్రజలు ఇచ్చే ప్రతి దరఖాస్తును ఆన్‌లైన్‌చేసి బాధితులకు రశీదు ఇవ్వాల్సివుంటుంది. ఇప్పుడంతా ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నందున ఎక్కడ తప్పుచేసినా అధికారులు దొరికిపోయే పరిస్థితి నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్షపార్టీల వ్యూహాలకు అధికారులు బలయ్యే ప్రమాదముంది. దీంతో ఏంచేయాలో పాలుపోక అధికారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

పులివెందుల చర్చిలో
జగన్ క్రిస్మస్ ప్రార్థనలు

పులివెందుల, డిసెంబర్ 25: కడప జిల్లా పులివెందులలోని సిఎస్‌ఐ చర్చిలో శుక్రవారం జరిగిన క్రిస్మస్ వేడుకల్లో వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి పాల్గొన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన తల్లి విజయమ్మ, భార్య వైఎస్.్భరతి, మాజీ మంత్రి వివేకానందరెడ్డి, కడప ఎంపి వైఎస్.అవినాష్‌రెడ్డి ఇతర కుటుంబ సభ్యులు ఉదయం చర్చికి చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తెలుగు రాష్ట్రాల ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించినట్లు జగన్ పేర్కొన్నారు. అనంతరం క్రిస్మస్ కేక్ కోసి కుటుంబ సభ్యులు, హాజరైన వారికి పంచిపెట్టారు. అనంతరం క్రిస్మస్ నూతన సంవత్సరం క్యాలెండర్‌ను జగన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు జగన్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. చర్చికి వచ్చిన మహిళలను ఆప్యాయంగా పలకరించి శుభాకాంక్షలు తెలిపారు.