తెలంగాణ

ఇరిగేషన్ ప్రాజెక్టులపై నేడు పార్లమెంటరీ బృందం కీలక భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 3: తెలంగాణలోని ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతిపై శనివారం హైదరాబాద్‌లో పార్లమెంటరీ బృందం కీలక సమావేశం జరుగుతుంది. ప్రాజెక్టుల పురోగతిని ఈ బృందం సమీక్షిస్తుంది. పార్లమెంటు సభ్యులు హుకుం సింగ్ అధ్యక్షతన ఏర్పడిన 17 మంది సభ్యుల కమిటీ హైదరాబాద్‌కు రానుంది. మాదాపూర్‌లోని నోవాటెల్‌లో తెలంగాణ ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో పార్లమెంటు సభ్యుల బృందం వివిధ అంశాలపై చర్చిస్తుంది. సత్వర సాగునీటి పారుదల ప్రయోజనాల పథకం (ఎఐబిపి) కింద చేపట్టిన ప్రాజెక్టుల పురోగతిని ఈ బృందం సమీక్షిస్తుంది. ఎఐబిపి కింద 1996-97లో ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన ప్రాజెక్టులలో తెలంగాణలో 16 ఉన్నాయి. వీటిలో ఐదు ప్రాజెక్టలు పూర్తికాగా, 11 ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. ఆన్ గోయింగ్ సాగునీటి ప్రాజెక్టుల ప్రస్తుత స్థితి, పూర్తి కావడానికి తీసుకోవలసిన చర్యలు, కేంద్ర ప్రభుత్వ సహకారం నిధులు వంటి అంశాలపై సమావేశంలో చర్చిస్తారు. కరీంనగర్ ఎంపి వినోద్‌కుమార్ కూడా చర్చల్లో పాల్గొంటారు. శనివారం ఉదయం ఎఐబిపి పథకాలపై చర్చ అనంతరం మధ్యాహ్నం కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య సంస్థల అధికారులతో పార్లమెంటరీ కమిటీ సమావేశం నిర్వహిస్తుంది. రిపేర్, రెనవేషన్, రెస్టారేషన్ (ఆర్‌ఆర్‌ఆర్) పథకం కింద రంగారెడ్డి జిల్లా సర్పన్పల్లి చెరువు పనులు గతంలో జరిగాయి. ఈ పనులపై కూడా పార్లమెంటరీ బృందం చర్చిస్తుంది. ఈ సమావేశాల్లో తెలంగాణ నీటిపారుదల రంగం స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్‌కె జోషి, ఇఎన్‌సి మురళీధర్‌రావు, కేంద్ర జల సంఘం అధికారులు, ఇరిగేషన్ ఒఎస్‌డి శ్రీ్ధర్‌రావు దేశ్‌పాండే తదితరులు పాల్గొన్నారు.