తెలంగాణ

సారథిలేని దేవాదాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 3: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రెండేళ్లు గడచిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలు జరుగగా, రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ (ఎండోమెంట్స్) నిర్లిప్తతగా కొనసాగుతోంది. సారథి లేని ఈ శాఖ నిర్వీర్యంగా కొనసాగుతోంది. భద్రాచలం, యాదాద్రి, వేములవాడ తదితర పుణ్యక్షేత్రాలను అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు శ్రద్ధ తీసుకుంటున్నప్పటికీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాలు, మఠాలకు కేంద్ర స్థానమైన దేవాదాయ కమిషనరేట్ విషయంలో నిర్లిప్తతగా ఉంటున్నారు. దేవాదాయ శాఖ ఎపి కమిషనర్‌గా వైవి అనూరాధను చాలా రోజుల క్రితమే ఎపి ప్రభుత్వం నియమించగా, తెలంగాణ దేవాదాయ శాఖ కమిషనర్ పోస్టు మొదటి నుండి ఖాళీగానే ఉంటోంది. రెవెన్యూ శాఖ కార్యదర్శి ఎన్.శివశంకర్ అదనంగా తెలంగాణ దేవాదాయ కమిషనర్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. రెవెన్యూ శాఖలోనే ఆయన తీరిక లేకుండా ఉంటున్నారు. దేవాదాయ శాఖ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పటికీ, రెవెన్యూలో పని ఒత్తిడి మూలంగా ఆయన కమిషనరేట్‌కు నెలకు ఒక పర్యాయం కూడా రాలేకపోతున్నారు. దేవాదాయ శాఖ ఆధీనంలో రాష్ట్ర వ్యాప్తంగా 12,302 దేవాలయాలు, ధర్మాదాయ సంస్థలు, మఠాలు ఉన్నాయి. ఇవి కాకుండా ఈ శాఖకు సంబంధం లేని ఆలయాలు మరో 20 వేల వరకు ఉన్నాయి. ఎక్కువ ఆదాయం ఉన్న ఆలయాలను మాత్రమే దేవాదాయ శాఖ తన ఆధీనంలోకి తీసుకుంటుంది. ఆలయాలు దేవాదాయ శాఖ నేతృత్వంలో ఉన్నా, లేకున్నా పరోక్షంగానో ప్రత్యక్షంగానో ఈ శాఖకు సంబంధం ఉంటుంది. ఈ శాఖలో అదనపు కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, సంయుక్త కమిషనర్లు, సహాయ కమిషనర్లు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు అంతా కలిసి 260 పోస్టులు ఉన్నాయి.
తెలంగాణ దేవాదాయ శాఖకు ఏటా దాదాపు 400 నుండి 500 కోట్ల రూపాయల వరకు ఆదాయం లభిస్తోంది. ఇంత ప్రాధాన్యత ఉన్న శాఖకు సారథి (కమిషనర్) లేకపోవడంతో సమస్యలు అనేకం పరిష్కారానికి నోచుకోకుండా పెండింగ్‌లో ఉంటున్నాయి. దేవాదాయ, ధర్మాదాయ శాఖ నిర్వహణకు ‘్ధర్మిక పరిషత్’ ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ, గత రెండేళ్ల వ్యవధిలో దీన్ని ఏర్పాటు చేయలేదు. ధార్మిక పరిషత్ ఏర్పాటు వల్ల హైందవ మతానికి సంబంధించిన అన్ని రంగాల నిష్ణాతులకు ధార్మిక పరిషత్‌లో అవకాశం ఉంటుంది.
కొలిక్కిరాని అర్చకుల సమస్య
దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులు, ఉద్యోగులు తమ వేతనాలు తదితర అంశాలపై గత ఏడాది నుండి ఆందోళన చేస్తున్నారు. రెగ్యులర్ కమిషనర్ లేకపోవడం, ధార్మిక పరిషత్ ఏర్పాటు కాకపోవడంతో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని స్పష్టమవుతోంది. రెండు పర్యాయాలు సమ్మె చేసినా తమ సమస్యలు పరిష్కారం కాలేదని ఆలయ ఉద్యోగుల రాష్ట్ర సంఘం అధ్యక్షుడు రంగారెడ్డి, అర్చకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భానుమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు.