అంతర్జాతీయం

ఉగ్రవాదంపై పాక్ ఉదాసీనత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 3: భారత్‌పై దాడులకు పాల్పడిన లష్కరే తొయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థలపై పాకిస్తాన్ ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంపై అమెరికా తప్పుపట్టింది. దీంతో ఉగ్రవాద సంస్థలు రిక్రూట్‌మెంట్‌లు, నిధుల సేకరణ నిరాటంకంగా కొనసాగుతోందని పేర్కొంది. అమెరికా విదేశాంగ శాఖ వార్షిక నివేదికలో పలు అంశాలను వెల్లడించింది. పాకిస్తాన్ మిలటరీ, భద్రతా దళాలు ఉగ్రవాదాన్న అణచివేయడానికి తీసుకున్న చర్యలను నివేదికలో వివరించింది. పాకిస్తాన్‌లోనే తెహ్రిక్ ఎ తాలిబన్ పాకిస్తాన్(టిటిపి) నిత్యం దాడులకు పాల్పడుతోంది. ఉగ్రవాదం, ఉగ్రవాద సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవడంలో పాక్ విఫలమవుతోందని యుఎస్ తెలిపింది. లష్కరే తొయిబా, దాని అనుబంధ సంస్థలు జైమాత్ ఉద్ దువా, పలహా ఎ ఇన్‌సానియత్ ఫౌండేషన్‌లు పాకిస్తాన్‌లో ర్యాలీలు నిర్వహిస్తూ, నిధుల సేకరణ చేపడుతున్నాయని నివేదికలో వెల్లడించారు. ఆఫ్గన్ తాలిబన్ లేదా హఖ్ఖనీని పాక్ కట్టడి చేయలేకపోతోందని తెలిపింది. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు లష్కరే తొయిబా, జైషే మహ్మద్‌ల కార్యకలాపాలు కొనసాగుతునే ఉన్నాయని, శిక్షణ, రిక్రూట్‌మెంట్‌లు, నిధుల సేకరణ నిరాటంకంగా కొనసాగుతోందని నివేదిక బయటపెట్టింది. కరుడుగట్టిన లష్కరే ఉగ్రవాది హఫీజ్ సరుూద్ బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చి సభల్లో పాల్గొనడం, వాటికి పాక్ మీడియాలో ప్రచారం కల్పించడాన్న అమెరికా తప్పుపట్టింది. ‘పాకిస్తాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ ఏజెన్సీ లష్కరే అనుబంధం సంస్థలకు ఎలాంటి ప్రచారం ఇవ్వవద్దని సెప్టెంబర్‌లో నిర్ణయించింది. అయినప్పటికీ అది ఎక్కడా అమలుకావడంలేదు’అని నివేదిక పేర్కొంది. దేశంలోనే ఎక్కడికక్కడ కార్యకలాపాలు జరిగిపోతున్నాయన్నారు.