తెలంగాణ

సికాస పోస్టర్లతో కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెల్లంపల్లి, నవంబర్ 8: నెల రోజులలో జరుగనున్న ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు ప్రజలంతా బహిష్కరించాలని సింగరేణి కార్మిక సమాఖ్య (సి.కా.స) కోల్ బెల్ట్ కమిటీ పేరుతో బుధవారం తెల్లవారుఝామున మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి పట్టణంలో 18 చోట్ల మావోయిస్టు పార్టీ అనుబంధ సంఘంపేరుతో వాల్ పోస్టర్లు వెలిశాయి. బూటకపు ఎన్నికలను బహిష్కరించాలని, సామ్రా జ్యవాద పోకడలను వ్యతిరేకిస్తూ ప్రజాస్వామిక ఉద్యమానికి సిద్ధం కావాలని వారు విడుదల చేసిన పోస్టర్లలో పిలుపునిచ్చారు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాయని, నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ జనసమితి పార్టీ అవకాశవాద రాజకీయలను ప్రజలంతా ఎండగట్టాలని పిలుపునిచ్చారు. నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని రూపొందించాలని వాల్ పోస్టర్లలో కోరారు. గత కొన్ని సంవత్సరాలుగా స్తబ్ధతగా ఉన్న బెల్లంపల్లిలో ఎన్నికలను బహిష్కరించాలంటూ పెద్ద ఎత్తున్న బెల్లంపల్లి పట్టణంలోని హనుమాన్ బస్తీ, రాంనగర్, అంబేద్కర్ నగర్, శంషీర్ నగర్, కాల్ టెక్స్ , కూరగాయల మార్కెట్, గంగారాం నగర్, బజార్ ఏరియా, తదితర ప్రాంతాలలో వాల్‌పోస్టర్లు వెలియడం కలకలం రేపింది. దీనికి తోడు బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రజలకు ద్రోహం చేసి భూస్వాములకు, సంపన్నులకు సేవ చేస్తున్నారని, వారు విడుదల చేసిన కరపత్రంలో పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. అవినీతి ఆరోపణలతో పాటు ల్యాండ్ మాఫియా చేస్తూ ప్రజలను, కార్మికులను అక్రమ అరెస్టులు, బెదిరింపులకు గురి చేస్తున్నారని వారు పేర్కొన్నారు. దళితుల నుంచి అక్రమంగా స్వాధీనం చేసుకున్న భూములను పేదలకు చెందేలా చూడాలని, లేనట్లు అయితే ఇటీవల విశాఖ మన్యంలో ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమేశ్వర్ రావులకు పట్టిన గతే పడుతుందని, కరపత్రంలో చిన్నయ్యకు చార్లెస్ పేరిట హెచ్చరికలు జారీ చేశారు. ఈ కరపత్రాలను గుర్తు తెలియని వ్యక్తుల ద్వారా చిన్నయ్య నివాసానికి పంపినట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు సి కా స పేరిట వెలిసిన వాల్ పోస్టర్లును తొలగించారు. శంషీర్ నగర్‌లో అనుమానిత ఇళ్లలో సోదాలు నిర్వహించారు.

చిత్రం..మాజీ ఎమ్మెల్యే చిన్నయ్యను హెచ్చరిస్తూ విడుదలైన లేఖ