తెలంగాణ

అర్ధరాత్రి తాళాలు పగులగొట్టి తనిఖీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సంపేట, నవంబర్ 8: వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో కాంగ్రెస్ కార్యాలయ తనిఖీ సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు గురువారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. కాంగ్రెస్ కార్యాలయ తాళాన్ని ఎన్నికల అధికారులు పగులగొట్టారని ఆగ్రహిస్తూ గురువారం నర్సంపేటలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. ఎన్నికల అధికారులు, పోలీసులు, కాంగ్రెస్ పార్టీ నాయకుల కథనం ప్రకారం.. నర్సంపేట పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహం సమీపంలో కాంగ్రెస్ కార్యాలయం గత 14 సంవత్సరాలుగా కొనసాగుతోంది. అయితే, తాజాగా ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ గురువారం తెల్లవారుజామున కాంగ్రెస్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. తమకు అందిన సమాచారం మేరకు తనిఖీ చేశామని అధికారులు చెబుతుండగా.. అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో ఎన్నికల అధికారులు దౌర్జన్యంగా తాళం పగులగొట్టారని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. అరగంటలోనే కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో చేరుకుని ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ ఇన్‌చార్జి సతీష్‌తో వాగ్వాదానికి దిగారు. నర్సంపేటలో కాంగ్రెస్ కార్యాలయం తాళాన్ని పగులగొట్టారనే సమాచారాన్ని కాంగ్రెస్ నాయకులు ఫోన్‌లో తమ క్యాడర్‌కు తెలపడంతో పెద్ద సంఖ్యలో వాహనాల్లో కార్యకర్తలకు నర్సంపేటకు తరలివచ్చారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా అధికారులు ఎలాంటి అనుమతీ తీసుకోకుండా తాళం పగులగొట్టారని ఆగ్రహిస్తూ కాంగ్రెస్ నాయకులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వరంగల్ రోడ్ కూడలి వద్ద అరగంట పాటు రాస్తారోకో చేయడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం చోటుచేసుకుంది. గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం పనె్నండు గంటల వరకు కాంగ్రెస్ నాయకుల ఆందోళనతో నర్సంపేటలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ రాస్తారోకోలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ తక్కళ్లపల్లి రవీందర్‌రావు, నాయకులు జగన్మోహన్‌రెడ్డి, రామానంద్, మురళీధర్, అశోక్, జక్క అశోక్, సొంటిరెడ్డి రంజిత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చిత్రం.... నర్సంపేటలో ర్యాలీ నిర్వహిస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు..