తెలంగాణ

నేడు వౌలానా ఆజాద్ జాతీయ విద్యా దినోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 10: భారత ప్రభుత్వ తొలి విద్యామంత్రి డాక్టర్ వౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ప్రతి ఏటా నవంబర్ 11న జాతీయ విద్యాదినోత్సవాన్ని నిర్వహించుకోవాలని మానవ వనరుల మంత్రిత్వశాఖ సూచించింది. అయితే ఈసారి రెండో శనివారం రావడంతో చాలా వరకూ విద్యాసంస్థలు మూత పడ్డాయి. ప్రైవేటు సంస్థలు, ఎన్‌జీవోలు మాత్రం జాతీయ విద్యాదినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాయి. కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉన్న విద్యాసంస్థలు సైతం అబుల్ కలాం ఆజాద్ జయంతిని నిర్వహించి అందుకు సంబంధించిన నివేదికలను నవంబర్ 20వ తేదీలోగా తమకు పంపించాలని ఇప్పటికే సీబీఎస్‌ఈ సూచించింది. సెమినార్లు, సదస్సులు, వ్యాస రచన, వక్తృత్వ పోటీలు, వర్కుషాప్‌లు, ర్యాలీలు, బ్యానర్ల ప్రదర్శన, ప్లకార్డుల ప్రదర్శన, నినాదాలు ఇవ్వడం వంటి రూపాల్లో ఆజాద్ జయంతిని నిర్వహించాలని సీబీఎస్‌ఈ సూచించింది. ఆజాద్ జయంతి సందర్భంగా 11వ తేదీ ఉదయం 11 గంటలకు బాగ్‌లింగంపల్లిలో జాతీయ విద్యా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు సీరా కన్వీనర్ ఎన్ నారాయణ, పగడాల లక్ష్మయ్యలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాల నాయకులు కూడా దీనికి హాజరవుతారు.