తెలంగాణ

ఒపీనియన్ పోల్స్, సర్వేలపై నిషేధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 10: తెలంగాణ శాసనసభకు జరుగుతున్న ఎన్నికల సందర్భంగా ఎగ్జిట్‌పోల్స్, ఒపీనియన్ పోల్స్, సర్వేలపై కేంద్ర ఎన్నికల కమిషన్ నిషేధం విధించింది. ఈ నిషేదాజ్ఞలు ఈ నెల 12 ఉదయం 7 గంటల నుండి 2019 డిసెంబర్ 7 వ తేదీ సాయంత్రం 5.30 గంటల వరకు అమల్లో ఉంటాయని వెల్లడించారు. ఈ సమయంలో ఎగ్జిట్/ఒపీనియన్ పోల్స్ నిర్వహించడం, పత్రికల్లో ప్రచురించడం, టీవీ ఛానళ్లలో ప్రసారం చేయడాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈ మేరకు శనివారం ఒక నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టం లోని 126 ఏ సెక్షన్‌కు అనుగుణంగా ఈ నోటిఫికేషన్ జారీ చేశామని కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఎన్నికలు స్వేచ్ఛగా నిర్వహించేందుకు ఒపీనియన్ పోల్స్, సర్వేలు అడ్డువస్తాయని, సర్వేలు, ఒపీనియన్ పోల్స్ ఓటర్లను ప్రభావితం చేస్తాయని అందుకే వీటిపై నిషేధం విధిస్తున్నామని వివరించారు. పత్రికలు, టీవీ ఛానళ్లు ఈ ఆదేశాలను తు.చ తప్పకుండా పాటించాలని సూచించారు.