తెలంగాణ

భారతీయ మహిళా స్టెమ్ స్కాలర్లకు సత్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 12: యూకే సాంస్కృతిక సంబంధాలు, విద్యావకాశాలకు సంబంధించిన అంతర్జాతీయసంస్థ బ్రిటిష్‌కౌన్సిల్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మాథ్స్ - స్టెమ్‌లో భారతీయ మహిళలు మాస్టర్స్ డిగ్రీ కొనసాగించేందుకు 70వ వార్షిక ఉపకార వేతనాలను ప్రకటించింది. స్టెమ్ స్కాలర్‌షిప్‌లు పొందిన 104 మంది భారతీయ మహిళలకు బ్రిటన్ ప్రధాని థెరిసా మే అభినందించారు. వీరంతా ఇంగ్లాండ్, స్కాట్‌లాండ్, వేల్స్ నార్తర్న్ ఐర్లాండ్‌లోని 43 బ్రిటిష్ వర్శిటీల్లో తమ సైన్స్ ఎడ్యుకేషన్ కొనసాగిస్తారు. ఈ సందర్భంగా బ్రిటిష్ కౌన్సిల్ ఓబీఈ డైరెక్టర్ అలెన్ గెమ్మల్ మాట్లాడుతూ బ్రిటన్ ఇండియా మధ్య కీలకమైన విద్యా సంబంధానికి ఇది అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందని అన్నారు. కేరళ బాధితులను ఆదుకునేందుకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి, తెలంగాణ రాష్ట్రంలోని వివిధ వర్శిటీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, అధ్యాపకులు, సహాయ సిబ్బంది అంతా కలిసి 58.20 లక్షల రూపాయిలను అందించారు. ఈ మొత్తాన్ని కేరళ ముఖ్యమంత్రి ఖాతాకు జమచేసినట్టు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. అలాగే బోధగురు లెర్నింగ్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థకు సోషల్ మీడియా సమ్మిట్ అవార్డు దక్కినట్టు సంస్థ సహాయ వ్యవస్థాపకుడు అనుభజైన్ తెలిపారు.