తెలంగాణ

కేసీఆర్ పాలనకు చరమగీతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 12: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గత 51 నెలల్లో ఖర్చు చేసిన 8 లక్షల కోట్ల రూపాయిలకు లెక్కలు చెప్పాలని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన టీడీపీ కార్యాలయంలో పోలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి, జాతీయ పార్టీ ప్రధానకార్యదర్శి ఇనుగాల పెద్దిరెడ్డి ఇతర సీనియర్ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. 8 లక్షల కోట్లకు లెక్కలు చెప్పమని అడుగుతుంటే ఇప్పటికీ చెప్పడం లేదని, కేసీఆర్ తన కుటుంబానికి, అనుయాయులకు దోచిపెట్టారని ప్రజలకు అర్ధం అయిందని రమణ ఆరోపించారు. కేసీఆర్ అర్ధాంతంగా ప్రభుత్వాన్ని రద్దు చేశారని, దాంతో ప్రజలపై ఎంతో భారం పడిందని అన్నారు. గత ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌కు 63 సీట్లు ఇస్తే వాటిని అక్రమంగా 93కు పెంచుకున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్ నేతలతో సంప్రదించకుండా సొంత నిర్ణయంతో కేసీఆర్ అభ్యర్ధులను ప్రకటించారని ఆ నిర్ణయం ప్రజల్లో తిరస్కరణకు గురైందని పేర్కొన్నారు. ఎంతో మంది ప్రాణ త్యాగాలతో తెలంగాణ వచ్చిందని, అలాంటి తెలంగాణలో ప్రజల అభిప్రాయానికి విలువ లేకుండా పోయిందని రమణ చెప్పారు. కేసీఆర్ దొరల పాలన కొనసాగిస్తున్నారని, దానికి చరమగీతం పాడే సమయం ఆసన్నమైందని అన్నారు. తెరాస పార్టీ ప్రచారానికి ఖర్చు చేస్తున్న వందల కోట్ల రూపాయిలు ఎక్కడి నుండి వచ్చాయో చెప్పాలని నిలదీశారు. కోదండరామ్ కనీసం సర్పంచ్‌గా కూడా గెలవరని చెప్పిన కేసీఆర్ ఇపుడు ఎందుకు ఉలిక్కి పడుతున్నారని నిలదీశారు. తెలంగాణ రాష్ట్రానికి గులాబీ చీడ పట్టిందని, దానిని తమ కూటమి వదిలిస్తుందని స్పష్టం చేశారు. 2014లో టీడీపీకి ప్రజలు రెండు అంకెల స్థానాలను ఇచ్చారని, మహాకూటమి అధికారంలోకి రావడానికి తాను , రావుల చంద్రశేఖరరెడ్డి ఇద్దరూ పోటీ నుండి తప్పుకున్నామని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రధానకార్యదర్శి బండ్రు శోభారాణి, అధికార ప్రతినిధులు ఉప్పలపాటి అనుషారాం, జక్కలి ఐలయ్య యాదవ్, మహ్మద్ తాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
చిత్రం..మీడియాతో మాట్లాడుతున్న రమణ