తెలంగాణ

కాంగ్రెస్ హయాంలోనే గిరిజనులకు రక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, నవంబర్ 19: కాంగ్రెస్ హయాంలో గిరిజనులకు రక్షణ కల్పించడంతో పాటు వారిని ఆర్థికాభివృద్ధి చేసేందుకు భూములు ఇచ్చి వారికి ఒక మార్గం చూపిస్తే, టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్ గిరిజనులను పూర్తిగా నిర్లక్ష్యం చేయడమే కాకుండా వారి భూములనుస్వాధీనం చేసుకున్నారని కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్‌అలీ ఆరోపించారు. సోమవారం జిల్లాలోని మాచారెడ్డి మండలం రత్నగిరి, బంజపల్లి, రాజ్‌ఖాన్‌పేట్‌లలో మోటర్‌సైకిల్‌పై ఎన్నికల ప్రచారం నిర్వహించి, పలు గ్రామాల్లో పాదయాత్ర ద్వారా ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈసందర్భంగా ఆయన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ, కేసీఆర్ కబడ్ధార్ గిరిజనుల భూముల జోలికి వస్తే మాత్రం ఇక చూస్తు ఊరుకోబోమని అన్నారు. కేసీఆర్ అధికారంలో వచ్చాక ఒక్క గిరిజనుడికైన భూమి ఎక్కడైన ఇచ్చాడా చూపించాలని సవాల్ చేశారు. నాకంఠంలో ప్రాణం ఉన్నంత వరకు గిరిజనుల భూములకు తాను అండంగా ఉంటానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే గిరిజనుల భూములకు పూర్తి రక్షణ కల్పిస్తామని అన్నారు. ఇక్కడ ఎంతో మంది చదువుకున్న నిరుద్యోగులు ఉద్యోగాలు లేక తిరుగుతున్నారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు ఉద్యోగాలతో పాటు నిరుద్యోగ బృతినిచెల్లిస్తామని అన్నారు. తాను అధికారంలో లేకున్నా అనేక ప్రైవేట్ కంపెనీల్లో ఇక్కడి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రాణహిత, చేవేళ్ల ప్రాజెక్ట్‌లు కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే సాధ్యం అయిందని అన్నారు. ఆనాడు తాజామాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ప్రాణహిత - చేవేళ్లను మరియు గోదావరి జలాలను అడ్డుకున్నారని ఆరోపించారు. మిషన్ కాకతీయ పథకంతో చెరువులన్ని నాశనం చేస్తున్నారని, ఇది కేవలం టీఆర్‌ఎస్ నాయకుల జేబులు నింపుకునే పథకం అని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే గల్ఫ్ బాధితుల కోసం 500 కోట్లతో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరుగుతోందని అన్నారు. షబ్బీర్‌అలీతో పాటు ఎన్నికల ప్రచారం టీపీసీసీ ఐటి చైర్మెన్ మదన్‌మోహన్, పొన్నల లక్ష్మారెడ్డి, పంపరి శ్రీనివాస్, నర్సాగౌడ్, రమేష్‌గౌడ్‌తో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు.

చిత్రం. ఎన్నికల ప్రచారంలో బైక్ నడుపుతున్న షబ్బీర్ అలీ