తెలంగాణ

వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిడమనూర్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చే శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని మాజీ సీఎల్పీ నాయకులు కుందూరు జానారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సోమవారం నల్లగొండ జిల్లా నిడమనూర్ మండల కేంద్రంలో నాగార్జునసాగర్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేసిన అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసంతో ఉన్నారని ఈ ఎన్నికల్లో విజయం సాధించి తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. కేసీఆర్‌కు ప్రజలు ఐదేళ్లు పాలించమని అధికారం ఇస్తే పాలన చేతకాక ముందస్తు ఎన్నికలకు వెళ్లారని, ఈ ఎన్నికల ద్వారా 300 కోట్ల భారం ఖజానాపై పడిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే.. ప్రజలకు మాయమాటలు చెప్పి గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఈ ఎన్నికల్లో మూఠాలతో ప్రజల ముందుకు వస్తున్నారని కేసీఆర్ ఎత్తుగడలను తిప్పికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.
సాగర్ నియోజకవర్గంలో తాను మారుమూల పల్లెలకు సైతం రహదారి సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగిందని గిరిజన తండాలు, మారుమూల ప్రాంతాలకు సైతం విద్యుత్ వెలుగులు నింపిన ఘనత తనదే అని, అదేవిధంగా రాష్ట్రంలో తనను మహా నాయకుడిని చేసిన ఘనత కూడా సాగర్ ప్రజలకు దక్కుతుందని, ఏడు సార్లు తనను ఆశీర్వదించి విజయం వైపు నడిపించిన ఈ ప్రాంత ప్రజలు మరోసారి తనను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని జానారెడ్డి అన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు రంగసాయిరెడ్డి, హనుమంతరావు, చినవీరయ్య, వెంకట్‌రాహుల్ తదితరులు ఉన్నారు.

చిత్రం..ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను అందజేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థ్ధి జానారెడ్డి