తెలంగాణ

కేసీఆర్ సునామీలో పార్టీలన్నీ కనుమరుగే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, నవంబర్ 19: అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ సునామీలో అన్ని పార్టీలు కనుమరుగై మళ్లీ టీఆర్‌ఎస్ ఘన విజయం సాధించి అధికారం చేపట్టడం ఖాయమని విద్యుత్, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖల మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. సూర్యాపేట టీఆర్‌ఎస్ అభ్యర్థిగా సోమవారం ఉదయం 11.16 నిమిషాలకు జిల్లాకేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా కేవలం ముఖ్య నాయకులతో కలిసి వెళ్లి నిరాడంబరంగా నామినేషన్ వేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం అమలుచేయని విధంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయడంతో పాటు ఎన్నికలు, ఓట్ల రాజకీయాలకు అతీతంగా సమాజం చివరి అంచున ఉన్న వారికి సంక్షేమ ఫలాలు అందించేలా ఎలాంటి హమీలివ్వకుండానే అనేక పథకాలను అమలుచేసిన ఘనత ఒక్క కేసీఆర్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. రాష్ట్రం ఏర్పడిన నాలుగున్నర ఏళ్ల కాలంలోనే ఎనలేని అభివృద్ధి సాధించి రాబోయే వందేళ్ల ప్రగతికి పునాదులు వేసిన కేసీఆర్ ఉంటేనే తమ ఆశలు నేరవేరుతాయని ప్రజలంతా భావిస్తున్నందున రాష్ట్రంలో తమ ప్రభంజనం ఖాయమన్నారు. టీఆర్‌ఎస్ ధాటికి కూటములు, అన్ని పార్టీలు కకాలవికలం కాకతప్పదన్నారు. ప్రత్యేకించి సూర్యాపేటలో జరుగుతున్న పోరు శాంతి కాముకులు, అభివృద్ధి నిరోధకుల మధ్య జరుగుతున్న పోటీగా అభివర్ణించారు. ఇదే విధంగా ప్రగతి కొనసాగించేందుకు నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రజలంతా మరోమారు తనను ఆశీర్వదిస్తారనే సంపూర్ణ విశ్వాసం ఉన్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ వై.వెంకటేశ్వర్లు, నాయకులు నంద్యాల దయాకర్‌రెడ్డి, ఉప్పల ఆనంద్, నెమ్మాది భిక్షం, కొండపల్లి దిలీప్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

చిత్రం.మంత్రి జగదీశ్‌రెడ్డికి తిలకందిద్దుతున్న సతీమణి సునీత