తెలంగాణ

అసంతృప్తుల తిరుగుబావుటా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, నవంబర్19: ఆదిలాబాద్ జిల్లాలో నామినేషన్ల గడవు చివరి రోజు సోమవారం రాజకీయ పార్టీల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. పార్టీలు, పొత్తులు, సిద్ధాంతాలు కాదని రాత్రికి రాత్రే బీ ఫారాలు తెచ్చుకున్న ఆశావాహులు తిరుగుబాటు అభ్యర్థులుగా నామినేషన్లు వేసి సొంత పార్టీ అభ్యర్థులకు ఝలక్ ఇచ్చారు. టీఆర్‌ఎస్ నుంచి ముందునుండి బెల్లంపల్లి లేదా చెన్నూర్ టికెట్ ఆశించి విఫలమైన మాజీ మంత్రి జి.వినోద్ అధిష్టాన బుజ్జగింపులకు తలొగ్గినట్టే కనిపించి ఆకస్మాత్తుగా సోమవారం బిఎస్పీ గుర్తుపై బెల్లంపల్లిలో నామినేషన్ వేసి ఆ నియోజకవర్గంలో అలజడి రేపారు. అదే విధంగా చెన్నూరులో కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ మంత్రి బోడ జనార్ధన్ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరుగుతూ బీఎల్‌ఎఫ్ పార్టీ బీఫారంపై నామినేషన్ దాఖలు చేశారు. ముథోల్‌లో కాంగ్రెస్ టికెట్ ఆశలు ఫలించకపోవడంతో కార్యకర్తల ఒత్తిడిమేరకు మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ తిరుగుబాటు అభ్యర్థిగా ఎన్‌సిపి గోడ గడియారం గుర్తుపై బీ ఫారం అందిపుచ్చుకొని సోమవారం నామినేషన్ వేశారు. ఖానాపూర్‌లో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి హరినాయక్ బీఎస్పీ టికెట్ తెచ్చుకొని తన అనుచరులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. అదే విధంగా బోథ్ కాంగ్రెస్ ఇన్‌చార్జి అనిల్ జాదవ్ సైతం అధిష్ఠాన బుజ్జగింపులకు తలొగ్గకుండా స్వతంత్ర అభ్యర్థిగా భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి నామినేషన్ వేయడం రాజకీయ వర్గాల్లో అలజడి రేపింది. సిర్పూర్‌టిలో టీఆర్‌ఎస్ టికెట్ ఆశలు గల్లంతు కావడంతో మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. రాజకీయాలు రంగులు మారగా నామినేషన్ల చివరి రోజు తిరుగుబాట్లు పెరగడంతో పార్టీల అభ్యర్థులకు తలనొప్పిగా మారింది.
పొత్తు ధర్మాన్ని విస్మరించిన టీజేఎస్
కూటమి పొత్తులకు తిలోదకాలిచ్చిన తెలంగాణ జన సమితి సోమవారం నామినేషన్ల చివరి రోజు హఠాత్తుగా మూడు నియోజకవర్గాల్లో తమ పార్టీ ఆశావాహులకు బిఫారాలు అందజేసి కాంగ్రెస్ అభ్యర్థులపై పోటీకి సిద్ధపడింది. రాత్రికి రాత్రే కోదండరాం నుంచి బీ ఫారాలు తెచ్చుకున్న ఖానాపూర్ అభ్యర్థి తట్ర భీంరావు, ఆసిఫాబాద్ నుంచి కొట్నాక విజయ్, చెన్నూర్ నుంచి దుర్గం నరేష్ తెలంగాణ జన సమితి నుండి నామినేషన్లు దాఖలు చేయడంతో కాంగ్రెస్ అభ్యర్థులకు కంటగింపుగా మారింది. ఈ అనూహ్య పరిణామాలు చోటుచేసుకోవడంతో మూడు చోట్ల స్నేహపూర్వక పోటీ తప్పదని ఆ పార్టీ నేతలే సెలవిస్తున్నారు. అధినేతలు బుజ్జగింపులు, రాయబారాలు సాగిస్తున్నారు.
చిత్రాలు.. మాజీ మంత్రి గడ్డం వినోద్ *మాజీ మంత్రి బోడ జనార్ధన్