తెలంగాణ

ఏం చూసి కేసీఆర్‌కు ఓటెయ్యాలి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 19:‘ ఏం చూసి ప్రజలు కేసీఆర్‌కు ఓటు వేయాలి’ అని తెలంగాణ జనసమితి అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ సూటిగా ప్రశ్నించారు. ప్రజాస్వామిక ఆకాంక్షలను కాలరాసి నిరంకుశ పాలన కొనసాగిస్తున్నందుకా? పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కుటుంబపాలనగా మలిచినందుకా? ప్రాజెక్టుల కమిషన్లతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినందుకా? రాజకీయాలను డబ్బుతో శాసిస్తున్నందుకా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణ రాష్ట్ర యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) సోమవారం కోదండరామ్‌తో మీట్ ది ప్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా కేసీఆర్ నిరంకుశ పాలన, కూటమి అజెండా, టీజెఎస్ భవితవ్యం తదితర అంశాలపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కుప్పకూలాయని ధ్వజమెత్తారు. ప్రాజెక్టుల రీ-డిజైనింగ్‌ను ఇంజనీర్లు కాకుండా కాంట్రాక్టర్లు, సీఎం కేసీఆర్ కలిసి చేశారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చలేదన్నారు. యూనివర్సిటీలకు పాలకవర్గాలు లేవన్నారు. ఉద్యమాల ద్వారా పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజాస్వామిక హక్కులను కాలరాసారని దుయ్యబట్టారు. ఎదిరించి మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండా పోయిందని, ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారిపై కేసులు, అరెస్టులు చేయడంతో పాటు కనీసం ప్రజాస్వామికంగా నిరసన తెలిపే హక్కును కూడా హరించివేశారని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. చివరికి ధర్నా చౌక్‌ను కూడా ఎత్తివేశారని నిప్పులు చెరిగారు. మీడియా గొంతు నొక్కి ప్రజల వాణి వినిపించుకుండా చేశారన్నారు. చివరకు తమ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లే అవకాశం లేకుండా ఎవరికీ అపాయింట్‌మెంట్ ఇవ్వని పరిస్థితిని కల్పించారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
3గోసి గొంగడేసి తెచ్చుకున్న తెలంగాణ ఎవరి పాలైంది2 అని ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న అన్నట్టుగా రాష్ట్రాన్ని గడీల పాలనగా మలిచారని కోదండరామ్ నిప్పులు చెరిగారు. ఢిల్లీకి గులాంలు అవుతారా? అమరావతికి తాకట్టు పెడుతారా? అని టీఆర్‌ఎస్ చేస్తోన్న విమర్శకు స్పందిస్తూ నిరంకుశ పాలన కంటే ఏదైనా బెటరేనని అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టుల రీ-డిజైనింగ్ పేరిట కమిషన్లు దండుకొని వాటి ద్వారా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం, రాజకీయాలను డబ్బుతో శాసిస్తూ నిరంకుశ పాలనను సాగిస్తోన్నారని దుయ్యబట్టారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సీఎం కేసీఆర్ తన సొంత కుటుంబ ఆస్తిగా వాడుకున్నారని నిప్పులు చెరిగారు. కేసీఆర్‌కు కార్యాచరణ అంటూ ఏదీ లేదనీ, ఉన్నదల్లా పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం పని చేయడం ఒక్కటేనన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులకు స్థానం లేకుండా చేసి, ద్రోహులకు పెద్దపీట వేశారని ధ్వజమెత్తారు. 3కేసీఆర్ నిరంకుశత్వాన్ని ధిక్కరించి ప్రజల ఆకాంక్షల కోసం, ప్రజల పక్షాన మొదటి నుంచి తెలంగాణ జనసమితి నిలబడింది. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీలోనే రాజకీయ పార్టీ పెట్టాలన్న ఆలోచన అప్పుడే వచ్చింది. మా పార్టీకి క్షేత్రస్థాయి నిర్మాణం ఉంది2అని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల నాటికి పూర్తిస్థాయి నిర్మాణంతో ప్రజల ముందుకు వస్తుందన్నారు. కేసీఆర్ నిరంకుశ పాలనను అంతమొందించడానికి కాంగ్రెస్, టీడీపీ, సీపీఐలతో కలిసి పీపుల్స్ ఫ్రంట్‌గా ఏర్పడ్డామన్నారు. సిద్ధాంతాలు వేరైనా తమందరి అజెండా ఒకటేనని కోదండరామ్ పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు చివరి మజిలీ కాదని, అది తొలి మెట్టని ఆయన ఉద్ఘాటించారు. సామాజిక మార్పు రావాలని ఆశిస్తున్నామన్నారు. తెలంగాణ ఉద్యమ వల్ల రాజకీయాల్లోకి కొత్తతరం నాయకత్వం వచ్చిందని, ప్రశ్నించేతత్వం, విశే్లషించుకునే తత్వం ప్రతి ఒక్కరిలో రావడం మంచి పరిణామన్నారు. పీపుల్స్ ఫ్రంట్‌కు కామన్ మినిమమ్ ప్రొగ్రామ్ ఉంటుందని, దానికి చట్టబద్ధత కల్పిస్తామని కోదండరామ్ వివరించారు.