తెలంగాణ

ఓటు వేసేందుకు ‘ఎపిక్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 4: తెలంగాణ శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఈ నెల ఏడున జరిగే పోలింగ్ సందర్భంగా సంబంధిత పోలింగ్ అధికారులకు ఓటర్లు తమ ఫోటో ఓటర్ గుర్తింపు కార్డులను (ఎపిక్) చూపించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ రజత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఎపిక్ కార్డులు అందని వారు తమ వద్ద ఉండే ఇతర గుర్తింపు కార్డు చూపించవచ్చన్నారు. ఎపిక్ లేనివారు తమ పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఉద్యోగులు తమ ఫోటో గుర్తింపు కార్డులు , బ్యాంకులు/పోస్ట్ఫాసులు ఇచ్చే పాస్‌బుక్కులు (్ఫటో ఉన్నవి), పాన్‌కార్డ్, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (ఎన్‌పీఆర్) కింద రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఆర్‌జీఐ) జారీ చేసిన స్మార్ట్‌కార్డు, జాతీయ ఉపాధి హామీ పథకం కింద జారీ చేసిన జాబ్ కార్డ్, కేంద్ర కార్మిక శాఖ పరిధిలోని హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు, ఫోటో కలిగి ఉన్న పింఛన్ డాక్యుమెంట్, ఎన్నికల యంత్రాంగం జారీ చేసిన ఫోటో ఓటర్ స్లిప్, ఎంపీ/ఎమ్మెల్యే/ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డు, ఆధార్ కార్డులలో ఏదో ఒక కార్డు తీసుకురావాలని రజత్‌కుమార్ సూచించారు. విదేశాల్లో నివసిస్తూ ఓటర్‌గా నమోదైన వారు తమ పాస్‌పోర్టును మాత్రమే చూపించాల్సి ఉంటుందని సీఈఓ తెలిపారు.