తెలంగాణ

ఖమ్మం జిల్లాలో మహిళా పోలింగ్ బూత్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, డిసెంబర్ 4: ఎన్నికల నిర్వహణలో ఖమ్మం జిల్లాలో వినూత్న ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఖమ్మం జిల్లాలో ఐదు నియోజకవర్గాలు ఉండగా ప్రతి నియోజకవర్గంలోను ప్రత్యేకంగా మహిళల కోసం ఒక పోలింగ్‌బూత్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ బూత్‌లో ఎన్నికల సిబ్బంది కూడా అందరూ మహిళలే ఉండనున్నారు. అదే విధంగా దివ్యాంగుల కోసం కూడా ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఒక పోలింగ్‌బూత్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ బూత్‌లో ఎన్నికల సిబ్బంది మొత్తం దివ్యాంగులే ఉండనున్నారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ తీసుకున్న నిర్ణయానికి ఎన్నికల కమిషన్ నుంచి కూడా అభినందనలు వచ్చాయి. ఇదే తరహాలో అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించడం విశేషం.