తెలంగాణ

సెక్యులర్ శక్తులు ఏకం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 4: దేశవ్యాప్తంగా మతోన్మాదుల హింసలు పెరిగిపోయాయని, దీనికి ప్రధాన కారణం బిజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ నేతృత్వం వహించడం దురదృష్టకరమని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి అన్నారు. మంగళవారం ముఖ్దూం కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్‌లో మతోన్మాదులు దళితులు, మైనార్టీలపై దాడులు చేయడం చూస్తే పథకం ప్రకారం హత్యాకాండకు దిగుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. దేశంలో మతపరమైన ఉద్రిక్తతలను ప్రోత్సహిస్తున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగిని తక్షణం తొలిగించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈనెల 3న హైదరాబాద్‌లో జరిగిన బిజేపీ ఎన్నికల బహిరంగ సభలో మాట్లాడుతూ నిజాం నుంచి తెలంగాణను విముక్తి చేయించింది సర్దార్ వల్లభాయ్ పటేల్‌నని చెప్పడాన్ని సురవరం తీవ్రంగా ఆక్షేపించారు. ఇలాంటి ప్రకటనలతో తెలంగాణ వాదుల్లో మరింత ఉద్వేగాన్ని రగిల్చిందని ఆయన కనె్నర్ర చేశారు. పటేల్ కంటే ముందే నిజాం పాలన నుంచి విముక్తి పొందడానికి వందలాది మంది బలిదానాలకు సిద్ధమయ్యారన్న విషయం ప్రధాన మంత్రికి తెలియదా? అంటూ ఆయన నిలదీశారు. రజాకార్లను ఎదుర్కోవడానికి తెలంగాణ సాయుధ పోరాటానికి ఆనాటి కమ్యూనిస్టులు ఎదురుతిరిగారని ఆయన గుర్తు చేశారు. ప్రధాన మంత్రి తెలంగాణ చరిత్ర తెలుసుకోకుండా ఉపన్యాసాలు ఇవ్వడం ఇకనైనా మానుకోవాలని ఆయన హితవు పలికారు. ఆనాటి సాయధ పోరాటంలో ఆర్‌ఎస్‌ఎస్ పాల్గొనలేదన్న విషయం ప్రధాన మంత్రి చరిత్ర చదువుకోవాలని సూచించారు. అనవసరంగా ప్రాంతల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టవద్దన్నారు. తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిజేపి, తెరాస మధ్య లాలూచీ వ్యవహారాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. జాతీయ స్థాయిలో బిజేపీకి వ్యతిరేకంగా ఫ్రంట్ ఏర్పాటుకు రాజకీయ సమీకరణలు జరుగుతున్నాయని అన్నారు. ఈనెల 10న ఢిల్లీలో బీజేపీకి వ్యతిరేకంగా దేశంలో ఉన్న సెక్యులర్ శక్తులు ఏకం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. తెలంగాణలో ఎంఐఎంతో తెరాస పొత్తు, బీజేపీతో తెరాస పొత్తులు లోపాయికారిగా ఉన్నాయన్న అంశం తెల్సిందేనని అన్నారు.