తెలంగాణ

20నుండి జాతీయ కామర్స్ కాన్ఫరెన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 4: హైదరాబాద్‌కు మరో కలికితురాయిగా జాతీయ కామర్స్ కాన్ఫరెన్స్ ఈ నెల 20వ తేదీ నుండి మూడు రోజుల పాటు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్టు ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి అజయ్ మిశ్రా, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి చెప్పారు. ఉన్నత విద్యామండలి కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఇందుకు సంబంధించిన బ్రోచర్‌ను విడుదల చేశారు. ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ లింబాద్రి, ప్రొఫెసర్ వి వెంకటరమణ, కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసరావు, ఉస్మానియా వీసీ ప్రొఫెసర్ ఎస్ రామచంద్రం, ప్రొఫెసర్ హెచ్ వెంకటేశ్వర్లు, ప్రొఫెసర్ పీ పురుషోత్తంరావు తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో అజయ్ మిశ్రా మాట్లాడుతూ ఈ సదస్సుతో హైదరాబాద్ ప్రతిష్ట పెరుగుతుందని అన్నారు. వీసీ ప్రొఫెసర్ రామచంద్రం మాట్లాడుతూ ఈ సదస్సు ఉస్మానియా యూనివర్శిటీలో జరుగుతుందని, మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో 1776 మంది ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. ఇందులో దాదాపు 500 మంది మహిళలున్నారని అన్నారు. వినూత్న ఆవిష్కరణలు- పారిశ్రామిక ఔత్సాహికత, సుస్థిరాభివృద్ధి, బ్యాంకింగ్- ఇన్సూరెన్స్, డిజిటల్ మార్కెటింగ్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, అకౌంటింగ్ రంగంలో నూతన పోకడలతో పాటు మానుభాయి ఎం షా పరిశోధన అవార్డు ప్రకటన కార్యక్రమం ఉంటుందని అన్నారు. రెండు లక్షల రూపాయిల విలువైన ప్రతిష్టాత్మక అవార్డును కామర్స్ రంగంలో ఒక ప్రముఖుడికి అందిస్తామని, అదే విధంగా నాలుగైదు పురస్కారాలను ఉత్తమ పరిశోధకులకు అందిస్తామని చెప్పారు. బెస్టు బిజినెస్ అకడమిక్ అవార్డు, సౌరభ్ షివారి మెమోరియల్ యంగ్ రీసెర్చర్ అవార్డు, ప్రొఫెసర్ సమిద్దీన్ మెమోరియల్ ఐసీఎ రీసెర్చి స్కాలర్ అవార్డు, ప్రొఫెసర్ ఏడీ షిండే మెమోరియల్ లెక్చర్ ఉంటాయని చెప్పారు. కాగా సదస్సుకు ఉన్నత విద్యామండలి సైతం ఆర్థిక సాయం అందజేస్తున్నట్టు మండలి చైర్మన్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి పేర్కొన్నారు.