తెలంగాణ

వామ్మో.. చలిపులి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, డిసెంబర్ 25: ఉత్తరాదిన వీస్తున్న శీతల పవనాల ప్రభావంతో ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా కనిష్ట స్థాయకి పడిపోయాయి. ఎనినో ప్రభావంతో నిన్నటివరకు ఎండ తీవ్రత, ఉక్కపోతను అనుభవించిన జిల్లా ప్రజలు అనూహ్యంగా వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులతో గురువారం రాత్రి నుండే చలిగాలులు, కనిష్ట ఉష్ణోగ్రతలు ప్రజలను ఇబ్బందులకు గురిచేశాయి. శుక్రవారం ఉదయం మంచుతెరలతో వాతావరణం చల్లపడగా జిల్లాలో 6.8 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత ఏడాది నవంబర్‌లోనే చలితీవ్రత ప్రజల్లో వణుకుపుట్టించగా ఈసారి ఆలస్యంగా చలి ప్రభావం నెలకొనడం గమనార్హం. ఎనినోవా కారణంగానే ఉష్ణోగ్రతల్లో అనూహ్యమార్పులు సంభవిస్తున్నాయని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. రెండు రోజుల క్రితం 14 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా శుక్రవారం ఉదయం ఏకంగా 6.8 డిగ్రీలకు పడిపోవడం చలితీవ్రతకు అద్దం పడుతోంది. శీతల పవనాలకు తోడు చలితీవ్రత కారణంగా ప్రజలు ఇంటినుండి బయటకు వెళ్లడానికి జంకుతున్నారు. ఉదయం 10 గంటల వరకు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఉదయం పూటనే తమ నిత్యకృత్యంలో భాగంగా పాలు, కూరగాయలు అమ్ముకునే రైతులు , గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాలకు వచ్చే ఉద్యోగస్తులు, చిన్నారులు, వృద్దులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. వాతావరణంలో నెలకొంటున్న మార్పుల కారణంగా చర్మవ్యాదులు, ఉబ్బసం, శ్వాసకోశ సంబంధ వ్యాదులు, చలిజ్వరం లాంటి వ్యాదులు ప్రబలుతున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. రిమ్స్ ఆసుపత్రిలో అధికంగా జ్వరాలు, శ్వాసకోశవ్యాధిగ్రస్తులే చికిత్స పొందుతుండడం కనిపించింది. ఆదిలాబాద్‌లో 6.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా బోథ్, ఆసిఫాబాద్, ఉట్నూరు ప్రాంతాల్లో 6.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదుకావడం గమనార్హం. ఉదయం 6 నుండి 7 గంటల వరకు మంచుదుప్పటి కప్పుకున్న విధంగా పొగమంచు కప్పేయడంతో వాహనచోదకులు, చిరువ్యాపారులు ఇబ్బందులకు గురికావాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే మరో నెల రోజుల పాటు చలితీవ్రత మరింత అధికంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. పల్లెల్లో, పట్టణాల్లో చలి మంటలు కాగుతుండగా, బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్లలో యాచకుల పరిస్థితి దయనీయంగా తయారైంది. చలి తీవ్రత నుండి తట్టుకునేందుకు ప్రజలు ఉన్ని దుస్తులను కొనుగోలు చేస్తున్నారు.