తెలంగాణ

కేసీఆర్‌కు ఒకే చోట ఓటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 10: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఒకే చోట ఓటు ఉందని చీఫ్ ఎలక్టోరల్ అధికారి డాక్టర్ రజత్ కుమార్ స్పష్టం చేశారు. కేసీఆర్ పేరు మొదట రెండు గ్రామాల్లో (సిద్ధిపేటలోని చింతమడక, గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవెల్లి) లోని ఓటర్ల జాబితాలో పేర్లు ఉండేవన్నారు. తుది ఓటర్ల జాబితా సిద్ధం చేసే సమయంలో సంబంధిత అధికారులు కేసీఆర్‌ను వివరణ అడిగారని, ఆయన తన పేరు చింతమడకలో మాత్రమే ఉండేలా చూడాలన్నారన్నారు. దాంతో ఓటర్ల తుదిజాబితాలో కేసీఆర్ పేరు ఎర్రవల్లి గ్రామం ఓటర్ల జాబితాలో తొలగించామన్నారు. రెండు చోట్ల కేసీఆర్ పేర్లు ఉన్నాయనడంలో సత్యం లేదని రజత్ కుమార్ వివరించారు.