తెలంగాణ

అదృష్టమంటే.. ఆత్రం సక్కుదే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, డిసెంబర్ 11: ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఒకే ఒక్కడు అరుదైన రికార్డును సొంతం చేసుకొని రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆసిఫాబాద్ ఎస్టీ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి కోవలక్ష్మిపై స్వల్ప మెజార్టీని సొంతం చేసుకొని కాంగ్రెస్‌కు ఖాతా తెరిపించారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి కోవలక్ష్మిపై పోటీచేసిన సక్కు చివరి క్షణం వరకు ఓట్ల లెక్కింపులో నరాలుతెగే ఉత్కంఠత రేపారు. ఇక్కడ మొదటి నుండి 7వ రౌండ్ వరకు వరసగా ఆత్రం సక్కుపై ఆధిక్యత కనబర్చిన కోవలక్ష్మి తన వర్గీయుల్లో ఆశలు రేపి ఆనందోత్సాహాలు కూడా జరుపుకున్నారు. చివరకు 8వ రౌండ్ నుండి వరసగా నెమ్మదిగా కోవలక్ష్మి ఆధిక్యత తగ్గుముఖం పడుతూ రౌండ్ రౌండ్‌కు క్రమేపి కాంగ్రెస్ అభ్యర్థి సక్కుకు మెజార్టీ పెరగడంతో ఫలితాలు నువ్వా నేనా అన్నరీతిలో దోబూచులాడాయి. 20 రౌండ్‌లో ఇరు పార్టీల్లోనూ ఉత్కంఠతతో పాటు ఉద్రిక్తత నెలకొంది. ఓట్ల లెక్కింపుపై తమకు అనుమానాలు ఉన్నాయని, రికౌంటింగ్ జరపాలని టీ ఆర్ ఎస్ అభ్యర్థి కోవలక్ష్మి వర్గీయులు పట్టుబట్టడంతో చివరి గంటపాటు ఓట్ల లెక్కింపు నిలిపివేసి ఈ సమాచారాన్ని ఎన్నికల కమిషనర్ రజత్‌కుమార్‌కు నివేదించారు. ఈవీ ఎం ఓట్ల లెక్కింపులో ఏలాంటి సందేహాలు ఉండకూడదని, ఫలితాలు ప్రకటించాలని ఎన్నికల కమిషన్ స్పష్టం చేయడంతో చివరి రౌండ్ ఉత్కంఠత కొనసాగింది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సక్కుకు 65788 ఓట్లు రాగా కోవ లక్ష్మికి ఇంచుమించు అదే స్థాయిలో 65617 ఓట్లు పోలయ్యాయి. 171 స్వల్ప ఆధిక్యతతో సక్కు గెలిచినట్లు ప్రకటించడంతో కాంగ్రెస్ వర్గీయుల్లో ఆనందానికి అవదులు లేకుండా పోయింది. గమ్మత్తు ఏమిటంటే ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపులోనూ ఉత్కంఠత కొనసాగడం గమనార్హం. కోవలక్ష్మికి అధికంగా 229 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పడగా కాంగ్రెస్ అభ్యర్థి సక్కుకు 226 ఓట్లు వచ్చాయి. 71 ఓట్లు చెల్లకుండా పోవడం గమనార్హం. ఫలితాల్లో చివరి వరకు దోబూచులాడి హస్తగతం కావడంతో జిల్లాలో ఒకే ఒక్కడుగా ఆత్రం సక్కు తనదైన రికార్డు సృష్టించడం గమనార్హం.
ఆదిలాబాద్, ముథోల్‌లో బీజేపీ రెండోస్థానం
ఆదిలాబాద్, ముథోల్ నియోజకవర్గాల్లో ఈసారి బిజెపి గెలుపుపై ఆశలు పెట్టుకోగా లక్ష్యం నెరవేరకుండా పోయింది.
ఈ రెండు స్థానాల్లోనూ టీ ఆర్ ఎస్ విజయం సాధించడంతో బిజెపి రెండో స్థానాలకు, కాంగ్రెస్ మూడో స్థానానికి పడిపోయింది. బెల్లంపల్లిలో గట్టిపోటీనిచ్చిన బి ఎస్పీ అభ్యర్థి జి.వినోద్ రెండో స్థానంలో నిలువగా మహాకూటమి అభ్యర్థిగా సి పి ఐ అభ్యర్థి గుండా మల్లేష్ ఏలాంటి పోటీనివ్వకుండా ధరావతు కోల్పోయారు.