తెలంగాణ

సిరిసిల్లలో కేటీఆర్ ఘన విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, డిసెంబర్ 11: నేతన్నల ఖిల్లా సిరిసిల్ల నియోజకవర్గంలో తిరిగి టీఆర్‌ఎస్ అభ్యర్థి, రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఎన్నికయ్యారు. లక్ష మెజార్టీతో ప్రచారంతో ముందుకు వెళ్ళిన టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు ఈ లక్ష్యం అంచుకు చేరుకుని, విజయాన్ని ముద్దాడారు. సిరిసిల్ల నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,18,329 ఉండగా, 80.57 శాతంతో 1,75,899 మంది ఓట్లు వేశారు. అయితే మొత్తం 13 మంది సిరిసిల్ల బరిలో నిలువగా, టీఆర్‌ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల తారకరామారావు 89,009 ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. కేటీ.రామారావుకు ఇక్కడ 1,25,213 ఓట్లు రాగా, తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి కెకె.మహేందర్‌రెడ్డికి 36,204 ఓట్లు లభించాయి. ఇక బీజేపీ అభ్యర్థి మల్లుగారి నర్సాగౌడ్‌కు 3,243 ఓట్లు, బీఎస్పీ అభ్యర్థి ఆవునూరి రమాకాంతరావుకు 3,245 ఓట్లు లభించాయి.