తెలంగాణ

15న పరమవీర చక్ర పుస్తకావిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 13: సద్గుణబాల మాసపత్రిక ఆధ్వర్యంలో పరమ వీర చక్ర పుస్తకావిష్కరణ కార్యక్రమం ఈ నెల 15వ తేదీ ఉదయం 10 గంటలకు కాచిగూడ నింబోలిఅడ్డ శ్రీ సరస్వతి శిశు మందిరం పాఠశాలలో నిర్వహిస్తున్నట్టు పత్రిక సంపాదకుడు డీఆర్‌ఎస్ నరేంద్ర తెలిపారు. ఆర్మీలో అనేక పతకాలు సాధించి పదవీ విరమణ చెందిన కల్నల్ వీఆర్‌ఆర్ ముఖ్య అతిథిగా వస్తున్నారని తెలిపారు. భారత్ టుడే న్యూస్ ఛానల్ చీఫ్ ఎడిటర్ జీ వల్లీశ్వర్, జాగృతి వార పత్రిక పూర్వ సంపాదకుడు వడ్డీ విజయ సారథి, నేవీ కమ్యూనికేషన్ అధికారి వీ శ్రీనివాస్, పుస్తక రచయిత వనకళ్ల వీరప్ప తదితరులు పాల్గొంటారని అన్నారు. దేశ సరిహద్దులను కాపాడేందుకు వీరోచితంగా పోరాడిన భారత వీర సైనికుల విజయ గాథలు ఈ పుస్తకంలో ప్రచురించినట్టు చెప్పారు.