తెలంగాణ

సీఎంకు ఆర్థిక సంఘం చైర్మన్ అభినందనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 13: తెలంగాణ రాష్ట్రానికి రెండో పర్యాయం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్‌కు రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ జి. రాజేశంగౌడ్, ఈ సంఘం సభ్యుడు చెన్నయ్య అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే రాజేశంగౌడ్ వెళ్లి అభినందనలు తెలిపారు. కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు వేగంగా అభివృద్ధి చెందుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అవసరమైన నిధులు ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా రాజేశంగౌడ్ కోరగా, అందుకు కేసీఆర్ సరేఅన్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఇలా ఉండగా ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయానికి క్షణం తీరికలేకుండా కృషి చేసిన ఎమ్మెల్యే, మాజీ మంత్రి టీ. హరీష్‌రావు, పార్లమెంట్ సభ్యురాలు కవితలను కూడా రాజేశంగౌడ్ అభినందించారు.