తెలంగాణ

డిసెంబర్ 23న లోక్ అదాలత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 13: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 23 న జాతీయ లోక్ అదాలత్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ మెంబర్ సెక్రటరీ ఏ. సంతోష్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం అధికారికంగా ఒక ప్రకటన జారీ చేస్తూ, ఇప్పటికే వివిధ కోర్టుల్లో పెండిగ్‌లో ఉన్న సివిల్ కేసులు, కాంపౌండబుల్ క్రిమినల్ కేసులను ఈ సందర్భంగా పరిష్కరిస్తామన్నారు. రాష్ట్రంలోని అన్ని స్థాయిలలో ఉన్న కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్‌లను నిర్వహిస్తున్నట్టు వివరించారు. కేసులను పరిష్కరించుకునేందుకు ముందుకు వచ్చే వారు జిల్లా కోర్టుల్లో ఉండే న్యాయ సేవా సదన్‌లోని జిల్లాలీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్/కార్యదర్శి లేదా మండల స్థాయిలోని లీగల్ సర్వీసెస్ కమిటీలు లేదా దగ్గరలో ఉండే కోర్టులో దరఖాస్తు చేసుకోవాలని సంతోష్‌రెడ్డి సూచించారు.