తెలంగాణ

కాంగ్రెస్ ఓడితే రాజీనామా చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, డిసెంబర్ 25: ‘నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుండి తప్పుకుంటానని టిఆర్‌ఎస్ ఓడితే సీఎం పదవికి కెసిఆర్ రాజీనామా చేయాలంటూ’ సిఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన సవాల్ విసిరారు.శుక్రవారం నల్లగొండలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ధర్మానికి, అధర్మానికి మధ్య పోరుగా అభివర్ణించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడితే తన సవాల్ మేరకు స్పీకర్‌కు నా రాజీనామా అందిస్తానని గతంలో తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామాను నేరుగా గవర్నర్‌కు అందించానన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ప్రజాసేవ తప్ప పదవులు ముఖ్యం కాదన్నారు. జిల్లాలో టిఆర్‌ఎస్‌కు మొత్తం 1110మంది స్థానిక ప్రజాప్రతినిధుల ఓటర్లలో కేవలం 138ఓట్లు మాత్రమే ఉన్నా అనైతికంగా పోటీకి దిగి ‘స్థానిక’ ఓటర్లను ప్రలోభాలకు, బెదిరింపులకు గురి చేస్తూ దౌర్జన్యంగా ఎన్నికల్లో గెలిచేందుకు సిఎం కెసిఆర్ ప్రయత్నిస్తున్నారన్నారు. ఒకవైపు అయుత చండీయాగం చేస్తున్న కెసిఆర్ ఇంకోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు అనైతిక అధర్మ పనులతో పాపాలు చేయడం ఎందుకంటూ కోమటిరెడ్డి నిలదీశారు. తెలంగాణ కోసం పోరాడిన కోమటిరెడ్డి కుటుంబాన్ని ఓడించేందుకు సిఎం కెసిఆర్ ఆంధ్ర పార్టీగా ఆయన తిట్టిన టిడిపి నుండి గత ఎన్నికల్లో ఎంపిగా పోటీ చేసి ఓడి పత్తా లేకుండా పోయిన వ్యాపారవేత్త తేరా చిన్నపరెడ్డిని పోటీకి పెట్టి వందల కోట్లు ఖర్చు చేయిస్తున్నారన్నారు.

నల్లగొండలో విలేఖరుల సమావేశంలో
మాట్లాడుతున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి