రాష్ట్రీయం

అదో అట్టర్‌ఫ్లాప్ సర్వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 15: కాంగ్రెస్‌కు దూరంగా ఉంటున్న మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు ఇచ్చిన సర్వే అట్టర్ ఫ్లాప్ అయ్యిందని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు వ్యాఖానించారు. సదరు వ్యక్తి విడుదల చేసిన సర్వే రిపోర్టును మీడియాలో కొంత మంది ఓవర్ హైప్ చేసి చూపించారని, అయినా ప్రజలు విశ్వసించలేదన్నారు. శనివారం సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో మీట్ ద ప్రెస్‌లో ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు ఆయన పై విధంగా స్పందించారు. తమకు లగడపాటి అంటే వ్యక్తిగతంగా కోపం లేదని, అయితే ఆయనకున్న కొద్దిగో గొప్ప విశ్వసనీయత కూడా ఈ సర్వేతో పోయిందన్నారు. తమకు ఎవరితోనూ వ్యక్తిగత కక్షలు లేవని కేటీఆర్ స్పష్టం చేశారు. లగడపాటి గతంలో తమ వల్లే రాజకీయ సన్యాసం తీసుకున్నారని, ఇప్పుడు సర్వేలూ చేయకుండా సర్వే సన్యాసం తీసుకున్నారని ఆయన చెప్పారు. ఆయనేమన్నా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామినా? అని కేటీఆర్ ప్రశ్నించారు. ‘ సర్వేలతో మేం కంగారు పడలేదు.. కంగారు పెట్టాం’అని మరోప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొననున్నందున మీరు సీఎం అవుతారా? అని ప్రశ్నించగా, ముఖ్యమంత్రిగా ఉంటూ దేశ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనవచ్చన్నారు. గతంలో ఎన్టీఆర్ సీఎంగా ఉంటూ నేషనల్ ఫ్రంట్ చైర్మన్‌గా కొనసాగారని ఆయన ఉదహరించారు.