తెలంగాణ

కష్టాల్లో కేటీపీపీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూపాలపల్లి/గణపురం, డిసెంబర్ 16 : భూపాలపల్లి జయశంకర్ జిల్లా గణపురం మండలం చెల్పూరు సమీపంలో ఉన్న కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం (కేటీపీపీ) ని కష్టాలు వెంటాడుతున్నాయి. మొదటి దశ 500, రెండో దశ 600 మెగావాట్లలో గత మూడు రోజులుగా విద్యుద్‌త్పత్తి నిలిచిపోయిన విషయం తెలిసిందే. మొదటి దశ 500 మెగావాట్ల ప్లాంట్‌లో బాయిలర్ ట్యూబ్‌లకు మరమ్మతులు చేసిన అధికారులు ఆదివారం సాయంత్రం సింక్రనైజేషన్ ప్రారంభించారు. ఈమేరకు సోమవారం సాయంత్రానికి పూర్తి స్థాయి ఉత్పత్తికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా రెండో దశ 600 మెగావాట్ల ప్లాంట్‌లో సాంకేతిక లోపం ఇప్పుడిప్పుడే బయటపడుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా టర్బన్ జనరేటర్ స్టేటార్‌లో ఎత్తు సమస్య రావడం వల్లనే ప్లాంట్‌ను నిలిపివేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బీహెచ్‌ఈఎల్ ఇంజనీర్లు స్టేటార్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. రెండో దశ 600 మెగావాట్ల ప్లాంట్ ప్రారంభ సీవోడి సమయంలో టర్బన్ జనరేటర్‌లో ఉన్న రూటర్‌లో బారింగ్ గేర్ సమస్య రావడంతో అప్పుడు బీహెచ్‌ఈఎల్ ఇంజనీర్ల ఆధ్వర్యంలో వారెంటీ సమయం ఉండటంతో వంద రోజుల్లో మరమ్మతులు పూర్తి చేశారు. ఇప్పుడు కూడా ఆ విభాగంలోనే మళ్లీ సమస్య పునరావృతం కావడంతో రెండో దశ ప్లాంట్ కనీసం మూడు నెలలు నిలిచిపోయే అవకాశం ఉందనే మాట వినవస్తోంది. సోమవారం పూర్తిస్థాయి సమాచారం తెలియనుంది. ఇప్పటికే జెన్-కో డైరెక్టర్ థర్మల్ లక్ష్మయ్య ప్లాంట్ మరమ్మతు పనులను పర్యవేక్షిస్తున్నారు. రెండు ప్లాంట్‌లు ఒకేసారి నిలిచిపోవడంతో పాటు జెన్-కో ఆదాయానికి భారీగా నష్టం వాటిల్లుతుండటంతో వారం రోజుల్లోగా జెన్-కో సీఎండీ కేటీపీపీకి రానున్నట్లు వినికిడి.

చిత్రం.. చెల్పూర్ సమీపంలో ఉన్న కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం